Komatireddy Venkat Reddy : ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంక ట రెడ్డి పిలుపు, సంస్కృతీ సంప్రదా యాలతో పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: సంస్కృతీ సంప్రదా యాలను పాటిస్తూ పండ గలను ప్రశాంతంగా జరు పుకోవాల ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వినాయక న వరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రం లో ని పాత పట్టణంలోని హనుమాన్ పురాలో ఏర్పాటు చేసిన ఒకటవ నంబర్ వినాయక విగ్రహానికి మం త్రి పూజాధిక్యాలు నిర్వహించి గణే ష్ శోభయాత్రను ప్రారంభించారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గడచిన 30 సంవ త్సరాల నుండి ఎలాంటి సంఘటన లకు తావివ్వకుండా ప్రశాంత వాతా వరణంలో వినాయక ఉత్సవాలను, నిమజ్జనాన్ని నిర్వహించుకోవడం సాంప్రదాయంగా వస్తున్నదని అ న్నారు. ఈ సంవత్సరం కూడా అ లాగే శాంతియుత వాతావరణం లో వినాయక శోభాయాత్ర, నిమజ్జనం నిర్వహించాలని యువతకు సూ చించారు. ప్రత్యేకించి యువకులు ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించ వద్దని కోరారు.
నల్గొండ పట్టణంలో మతసామర స్యంతో పాటు ,అన్ని మతాలను గౌరవిస్తూనే అభివృద్ధిని కొనసాగి స్తుఎంన్నామన్నారు. 200 కోట్ల రూ పాయలతో యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ని ర్మాణాన్ని మొదలుపెట్టామని, ల తీ ఫ్ సాహెబ్ దర్గా గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు 150 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్లు నిర్మిస్తున్నామని, 30% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఈ సంవత్సరం వినాయ క మండపాలకు ఉచితంగా విద్యు త్తును ఇవ్వడం జరిగిందని తెలిపా రు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ అన్ని శాఖల సిబ్బంది గ ణే ష్ ఉత్సవ కమిటీల సహకారంతో క్రమశిక్షణను పాటిస్తూ 9 రోజుల పా టు జిల్లాలో గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకున్నారని, గ ణేష్ శోభాయాత్రతో పాటు, నిమజ్జ నాన్ని కూడా ఇదేవిధంగా కొనసాగిం చాలని ఆమె కోరారు. నల్గొండ జి ల్లాలో ప్రజలు గంగా, జమున తెహ జీబ్ సాంప్రదాయాన్ని పాటిస్తారని అన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాటు చేశామని తెలిపా రు.ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లను మానుకొని మన పూర్వీకులు ఇచ్చి న ఆదర్శాలు, సందేశాల స్ఫురణ తో నిమజ్జనంలో పాల్గొనాలని, ఒక సంకల్ప దీక్షతో అభివృద్ధికి పాటుప డాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మా ట్లాడుతూ గణేష్ శోభయాత్ర, నిమ జ్జనాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా 2000 వేల మందితో పో లీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు .నల్గొండ పట్టణంలో వె య్యి మంది పోలీసులను నియ మించామని ,టీఎస్ ఎస్పి స్పెషల్ పోలీస్ బెటాలియన్ కూడా జిల్లా కు వచ్చిందని దీనికి తొడు క్రైమ్ టీములను ఏర్పాటు చేశామని, భ ద్రతపరంగా అవసరమైన అన్ని ఏ ర్పాట్లు చేస్తామని, హైదరాబాద్ త ర్వాత నల్గొండ జిల్లాలోనే పెద్ద ఎత్తు న వినాయక శోభాయాత్ర నిర్వహి స్తారని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించేందుకు గణే ష్ ఉత్సవ కమిటీలు, అన్ని మతాల వారు సహకరించాలని విజ్ఞప్తి చేశా రు.
ముందుగా హనుమాన్ నగర్ గణేష్ విగ్రహ కమిటీ అధ్యక్షులు ఇటుకల కృష్ణయ్య మాట్లాడారు.నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి ,గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కర్నాటి యాద గిరి, వక్త వెంకట్ నివాస్ ,చింతల సాంబమూర్తి మాజీ మున్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ,మాజీ జెడ్పిటిసి, లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించారు.