–స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్
Dog adoption program: ప్రజా దీవెన, నల్లగొండ: సమాజం లో ఇటీవల కాలంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్న దృ ష్ట్యా అవగాహనతో పాటు, వ్యాక్సి నేషన్, కుక్కల పట్ల ప్రేమ, దయ చూపించే వారికి నల్గొండ జిల్లాలో ఈనెల 13న కుక్కల దత్తత కార్య క్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ట్లు స్థానిక సంస్థల ఇన్చార్జి అదన పు కలెక్టర్ నారాయణ అమిత్ తెలి పారు. ఈ విషయంపై గురువారం అయన కలెక్టర్ కార్యాలయ సమా వేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల కాలంలో కు క్కలు ప్రజలపై దాడి చేసి గాయ పరుస్తున్న సంఘ టనలు పెరిగిపోతున్నాయని, అ యితే దీనికి ఒక శాస్త్రీయ పరిష్కా రంలో భాగంగా నల్గొండ జిల్లా యం త్రాంగం వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ తో పాటు, స్టెరిలైజేషన్ కార్యక్రమా న్ని చేపట్టడమే కాకుండా ,కుక్కల పట్ల ప్రజలందరికీ అవ గాహన క ల్పించడం, కుక్కలు కరవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ కుక్క కరిస్తే వాక్సినేషన్ తీ సుకోవ డం, రేబిస్ వ్యాధి సోకాకుండా చూసుకోవడం , వంటి జాగ్రత్త లను ఒకవైపు తెలియజేస్తూనే కు క్కల పట్ల దయ,కరుణ చూపే విధం గా ఎవరైనా కుక్కల ప్రేమికులు ఉ న్న ట్లయితే వారికి వీధి కుక్కలను దత్త త ఇచ్చే కార్యక్రమాన్ని చేపడు తు న్నట్లు చెప్పారు.
ఈనెల 13 న రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి నల్గొండ స మీపంలో ఉన్న రామ్ నగర్ మున్సి పల్ పార్కులో కుక్కల దత్తత కార్య క్రమాన్ని ప్రారం భించనున్నారని ఆ యన వెల్లడించారు. కుక్కల దాడు ల నివారణలో భాగంగా నల్గొండ జి ల్లాలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ద్వారా స్టెరిలైజే షన్ కార్యక్రమాలు చేపడుతున్నా మని, ఇదే తరహాలో మిర్యాలగూడ లో సైతం 50 లక్షల రూపాయలతో ఎనిమల్ బర్త్ కంట్రో ల్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఇటీవలే మిర్యాలగూడ శాసనస భ్యులు, ఎమ్మె ల్సీ శంకుస్థాపన చేయడం జరిగింద ని చెప్పారు.
స్టేరిలైజేషన్తోపాటు జిల్లాలోని అన్ని మండలాలలో వ్యాక్సినేషన్ క్యాం పులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి మండల కేంద్రం లో కుక్కల పట్ల తీ సుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహ న, వ్యాక్సినేష న్, స్టెరిలైజేషన్ పై పెద్ద ఎత్తున ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశా మని ,అలాగే ము న్సిపల్ లో కా ర్యాలయంలో సైతం భారీ ఎత్తున అవగాహన కార్యక్ర మాలను చేపట్టి నట్లు తెలిపారు. గత రెండు వారాల క్రితం దేవరకొండ డివిజన్లో చేపట్టిన అవగాహన కార్య క్రమం సత్ఫలి తాలు ఇచ్చిందని, దీ నిని దృష్టిలో ఉంచుకుని నల్గొండ మున్సిపాలిటీ లో 13వ తేదీ ఉద యం 7 గంటల కు రామ్ నగర్ మున్సిపల్ పార్కు లో నిర్వహించే కుక్కల దత్తత కా ర్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కుక్కలను దత్త త తీసుకోవా లని కోరారు.
కుక్కలు కావాల్సినవారు మున్సిప ల్ కమిష నర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసు కోవాలని ఆయన తెలిపారు. తా ము చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తు న్నట్లు ఆయన వెల్లడించారు. ఇలా ప్రతి ఒక్కరు వీ ధి కుక్కలను దత్తత తీసుకోవడం వల్ల కుక్కల దాడి నుం డి తప్పించుకోవచ్చని, ఇతర ప్రాం తాలకు ఇతర దేశాలకు చెందిన కు క్కలను పెంచు కోవడం ఇక్కడి వా తావరణ పరిస్థితులకు అలవాటు పడడం కష్టం కాబట్టి ఇండియన్ కు క్కలని దత్తత ఇస్తున్నట్లు చెప్పారు. 13వ తేదీ సు మారు 50 కుక్కలు దత్తత ఇచ్చేందుకు చర్యలు తీసు కుంటుండగా, ఇంకా ఎవరైనా ముం దుకు వచ్చినట్లయితే 100 కుక్కల వరకు దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయ న వెల్లడించారు. భ విష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ మాదిరిగానే నల్గొండలో పెంపుడు కుక్కల రిజి స్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించ నున్నట్లు ఆ యన వెల్లడించారు.
జిల్లా వ్యాప్తం గా నిర్వహించిన స ర్వేలో సుమారు 40 వేల కుక్కలు నల్గొండ జిల్లాలో ఉన్నట్లు తెలిసింద ని, మరోసారి సర్వే నిర్వహించి పూ ర్తిస్థాయిలో ఎన్ని కుక్కలు ఉన్నా యో తెలియజేస్తామని ఆయన వెల్లడించారు. రెవె న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పశుసం వర్ధక శాఖ అధికారి డాక్టర్ రమే ష్ ,మున్సిపల్ కమిషన ర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తది తరులు ఈ మీడియా ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు.