Nalgonda wellness centre : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఉద్యో గస్తులు, జర్నలిస్టుల ప్రత్యేక వైద్య సేవల కేంద్రం వెల్ నెస్ సెంటర్ వెల వెలబోతోంది. సిబ్బంది అందుబాటు లో ఉన్నా సేవల విషయంలో వారి తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోం ది. ప్రభుత్వ వెల్ నెస్ ఉదాసీనత తో ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రై వే ట్ ఆస్పత్రుల బాటపట్టి జేబులు గు ల్ల చేసుకుంటూ ఉద్యోగస్తులు, జ ర్నలిస్టులు అవస్థలు పడుతున్నా రని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జర్నలిస్టులు, ఉద్యోగుల కోసం ఏ ర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్ ఉ త్సవ విగ్రహంలా తయారైoదని, ఉండాల్సిన సదుపాయాలు ఏ మా త్రం లేవని ఆరోపణలు గుప్పుమం టున్నాయి. కనీసం చేయి పట్టి చూ సిన పాపాన పోలేదు అక్కడి వైద్యు లు లేరని, అవసరమైన గోలిమందు లు కూడా అందుబాటులో ఉంచ కుండా నిర్లక్ష్యo వహిస్తున్నారని బాధితులు గొల్లుమంటున్నారు.
ముఖ్యంగా గత మూడు నెలలుగా షుగర్, బీపీ వంటి ప్రాణాంతక వ్యా ధులకు అవసరమైన ఔషధాలు అం దుబాటులో లేవని ఉద్యోగస్తులు జ ర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కో సం ఉద్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రి లో పొందాల్సిన వైద్య సేవలు ప్రైవే ట్ ఫార్మసీలపై ఆధారపడాల్సి వ స్తుందని ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.
రోజూ వందలాది మంది రోగులు సెంటర్‌ను ఆశ్రయిస్తుండగా, అక్కడ ఔషధాల లభ్యత లేకపోవడం ప్రజ లను ఇబ్బందులకు గురిచేస్తోంది. అధికారులు ఈ సమస్యను పరి ష్కరించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయా వర్గా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఉద్యోగులు, జర్నలిస్టు లు చెబుతున్న మాటల ప్రకారం మాకు డాక్టర్ చెక్ చేస్తారు కానీ మందులు ఇవ్వడం లేదు, మూడు నెలలుగా షుగర్, బీపీ మందులు దొరకట్లేదు. ప్రైవేట్‌లో డబ్బులు పెట్టి కొనాల్సి వస్తోంది.
ఇదే పరిస్థితి కొనసాగితే వెల్ నెస్ సెంటర్ ఆరో గ్యసేవలపై నమ్మకం పోతుందని ఉద్యోగస్తులు జర్నలిస్టు లు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
ఈ తాజా పరిణామంపై జిల్లా అధి కారులు స్పందించితక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు, ఉద్యోగులు కోరుతున్నారు.