CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యా ఖ్య, కృష్ణానదిలో నికర, మిగులు, వరద జలాలైనా తెలంగాణకు హ క్కు నీటివాటాలోచుక్క నీరు కూడా వదులుకునేదు లేదు
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: కృష్ణా జ లాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధిం చి తీరాలని ముఖ్యమంత్రి ఎ.రేవం త్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరి గేషన్ ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా నదిలో నికర జలాలైనా, మిగులు జలాలై నా, వరద జలాలైనా సరే తెలంగా ణాకు చెందాల్సిన నీటివాటాలో ఒ క చుక్క నీరు కుడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశా రు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సా ధించుకునేందుకు పట్టుబట్టాలన్నా రు. అందుకు అవసరమైన ఆధారా లన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ ని పుణులకు అందించాలని అధికారు లను ఆదేశించారు.ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జలాల వి వాద ట్రిబ్యునల్ విచారణలో తెలం గాణ తుది వాదనలు వినిపిం చా ల్సిఉంది. తెలంగాణ ప్రయోజనాల ను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభు త్వం బలమైన వాదనలు వినిపిం చాలని ముఖ్యమంత్రి అధికారుల ను ఆదేశించారు.నీటి పారుదల శా ఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి స్వయంగా ఈ విచారణ లో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు.
కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ ఎ దుట తెలంగాణా ప్రభుత్వం అనుస రించాల్సిన వైఖరిపై ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (#ICCC) లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇంతకాలం కృష్ణా నదీ జలాల్లో తె లంగాణకు జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి, మనకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థవంతమైన వాదనలు వినిపిం చాలని ఈ సందర్భంగా ముఖ్యమం త్రి న్యాయ నిపుణులకు పలు సూ చనలు చేశారు. అందుకు అవసర మైన సాక్ష్యాధారాలన్నీ ట్రిబ్యునల్ కు సమర్పించాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివర కు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అ సంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్ల క్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివ రా లన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాల ని ముఖ్యమంత్రి చెప్పారు. ఉమ్మ డి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్లు అన్నీ సి ద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టు ల వివరాలన్నీ ట్రిబ్యునల్కు అందిం చాలని సూచించారు.
గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రా వాల్సిన నీటి వాటాలను సాధించక పోగా ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీ లు కట్టబెట్టి, 299 టీఎంసీల వాటా కు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఈ సందర్భం గా చర్చకు వచ్చింది.గత ప్రభుత్వం 299 టీఎంసీల వాటాకు ఒప్పుకు న్న విషయాన్ని ఇప్పుడు ఆంధ్రప్ర దేశ్ ట్రిబ్యునల్ ముందుకు తెచ్చిం దని న్యాయ నిపుణులు సీఎంకి వి వరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయో జనాలను పట్టించుకోకపోవటంతో ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమం త్రి అన్నారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణం గా విఫలమైందన్నారు. కృష్ణా నదిపై తలపెట్టిన పాలమూరు – రంగారెడ్డి నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నిం టినీ పెండింగ్లో పెట్టిందన్నారు. నీ టి వాటాల విషయంలో తీరని అ న్యాయం చేసిందన్నారు.
దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూ త్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలం గాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీ ఎంసీల నీటి వాటా రావాల్సి ఉం దని, అందుకు అనుగుణంగా వాద నలు సిద్ధం చేయాలని ముఖ్యమం త్రి స్పష్టం చేశారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహ రించటంతో ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకు పోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యు నల్ ముందుకు తీసుకురావాలని సీఎం చెప్పారు.శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుం చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీ మ్ ద్వారా రోజుకు పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తుందని, ఇతర బే సిన్లకు తరలించుకుపోతోందన్నారు.
ఎక్కడపడితే అక్కడ కాల్వల సామ ర్థ్యం పెంచుకోవటంతో పాటు పట్టిసీ మ, పులిచింతల, చింతలపాడు వ రకు ఏపీ అక్రమంగా నీటిని తరలి స్తున్న అంశాలన్నీ ఆధారాలతో స హా ట్రిబ్యునల్కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదే శించారు.కృష్ణా నీటిని ఏపీ అక్ర మం గా మళ్లించటంతో శ్రీశైలం, నాగార్జు నసాగర్ తో పాటు పులిచింతల వ ద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూత పడే ప్రమాదం ముంచుకు వ చ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉ త్పత్తయ్యే జల విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగుతోందన్నారు. ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్ ఎదుట వాదనలుగా వినిపించాలని ముఖ్య మంత్రి ఆదేశించారు.
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందు కు అన్ని అర్హతలున్నాయని ము ఖ్యమంత్రి అన్నారు. సాగునీటి, తా గునీటి అవసరాలతో పాటు మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతమైన ఉమ్మ డి మహబూబ్నగర్, రంగారెడ్డి, న ల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు త ప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగా ణా ప్రాంతంలో తలపెట్టిన ప్రాజెక్టు లు పూర్తి చేయక పోవడం వల్లనే కృ ష్ణా జలాశయాలను తెలంగాణా వి నియోగించుకోలేకపోయిందని గు ర్తు చేయాలన్నారు.తెలంగాణ తర ఫున వాదనలను వినిపించేందుకు ఇదే సరైన అవకాశమని ముఖ్య మంత్రి అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం తో పాటు, కృష్ణా నదీ జలాల్లో రా వాల్సిన వాటాల భవిష్యత్తును ది శానిర్దేశం చేసే వాదనలు కావటంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని ముఖ్యమంత్రి న్యాయ నిపుణులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీ సీఎస్ వైద్యనాథన్ (CS Vaidyan athan), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) మాజీ చైర్మన్ కుష్వీందర్ వోహ్రా (Kushvinder Vohra), నీటి పారుదల శాఖ సలహాదారు ఆది త్యనాథ్ దాస్ (Aditya Nath Da s)తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.