Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Ponguleti : జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టు బడి ఉన్నాం

— అక్రిడిటేష‌న్ పాల‌సీపై యాక్షన్ ప్లాన్

–జ‌ర్నలిస్టుల స‌మ‌స్యల‌పై మంత్రి పొంగులేటి సుదీర్ఘ స‌మీక్ష

Minister Ponguleti : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి నాయ కత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్న లిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ ని ర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. అర్హులైన జర్నలి స్టు లందరికి అక్రిడిటేష‌న్ కార్డ్ లు అం దేలా విధివిధానాలను రూపొందిం చాలని అధికారులను ఆదేశించా రు. సోమవారం నాడు డాక్టర్ బిఆ ర్‌అంబేద్కర్ స‌చివాల‌యంలో హో మ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్తా, ప్రెస్ అకాడ‌మీ ఛైర్మన్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి, ఐ&పిఆర్ స్పెషల్ క‌మీష‌న‌ర్ సిహెచ్‌. ప్రియాంక‌, సీపీ ఆర్‌వో జి. మ‌ల్సూర్‌ తో క‌లిసి సమీ క్ష నిర్వహించారు.

ఈ స‌మావేశంలో ప్రధానంగా అక్రి డిటేష‌న్ పాల‌సీ, జ‌ర్నలిస్ట్‌ల హెల్త్ పాల‌సీ, జ‌ర్నలిస్టుల అవార్డులు, జ‌ ర్నలిస్టుల‌పై దాడుల‌కు సంబంధించి హైప‌వ‌ర్ క‌మిటీ త‌ద‌త‌ర అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ జర్నలిస్టులపై దాడులు జరగ కుండా ప్రభుత్వం అన్నీ చర్యలు తీ సుకుంటుందని, ఇందుకోసం హై ప వర్ కమిటీని కూడా పునరుద్దరిం చాలని నిర్ణయించినట్లు వెల్లడించా రు. ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి కాంగ్రె స్ ప్రభుత్వం జి.ఓ. జారీచేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరున వాత ఆ ఊసే ఎత్తలేదని విమర్శిం చారు.

అలాగే, జర్నలిస్టుల జీత భత్యా లకు సంబంధించి త్రైపాక్షిక కమిటీ ని కూడా పునరుద్దరిస్తున్నట్లు తెలి పారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై సమగ్రంగా చర్చించామని, ఇన్సూ రెన్స్ పాలసీలో ఏది జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉంటుందో అనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.అక్రి డి టేష‌న్ పాలసీపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.

జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను తక్షణమే రూ పొందించాలని అధికారులకు సూచించారు. జర్న లిస్టులకు అవార్డులను పునరు ద్దరించాలని ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఆరో గ్యశ్రీ సిఇఓ ఉదయ్ కుమార్, కా ర్మి క శాఖ అడి షనల్ కమిషనర్ గం గాధర్ తదిత రులు పాల్గొన్నారు.