CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రోడ్డుపై వెళుతున్నప్పుడు ఒక వాహనం బ లంగా ఢీ కొట్టడంలో రెండు కాళ్లు విరిగి అచేతన స్థితిలో ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చే యూతనందించారు. నిమ్స్ ఆసు పత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహా యం అందించి ఆదుకున్నారు.
మూడు రోజుల కిందట వనపర్తి ఎ స్పీ రావుల గిరిధర్ నిమ్స్ ఆసు పత్రిలో వైద్యుడి వద్దకు వెళ్లినప్పు డు అక్కడ రెండు కాళ్లు, దడవ ఎ ముక విరిగిన ఒక యువకుడు ద యనీయ స్థితిలో ఉన్న వ్యక్తి వివరా లను అడిగి తెలుసుకున్నారు. కడ ప జిల్లాకు చెందిన కరీముల్లా చెర్లప ల్లిలోని ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.
కంపెనీలో పని ముగించుకుని ఇం టికి వెళుతున్న సమయంలో వేగం గా వచ్చిన ఒక వాహనం ఢీ కొట్టడం తో రెండు కాళ్లు విరగడమే కాకుం డా పలు గాయాలతో అపస్మార స్థి తిలోకి వెళ్లాడు. తర్వాత కరీము ల్లాను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా విరిగిన కాలికి డాక్టర్ లలిత్ మోహ న్ ఆపరేషన్ చేశారు. ఈ వివరాల ను తెలుసుకున్న వనపర్తి ఎస్పీ విష యాన్ని ముఖ్యమంత్రి కార్యాలయా నికి అందించారు.
ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీని వాస్ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పం దించి ఆ వ్యక్తి చికిత్సకయ్యే ఖర్చు రూ. 2.50 లక్షల రూపాయల మేర కు ఎల్ఓసీ జారీ చేయాలని ఆదే శించారు.చికిత్సకు అయిన ఖర్చు ను ఎలా చెల్లించాలో తెలియక తీవ్ర ఆందోళన పడుతున్న సమయంలో మానవతా దృక్పథంతో ముఖ్యమం త్రి వెంటనే స్పందించి సహాయ సహ కారాలు అందించారని పేర్కొంటూ, ముఖ్యమంత్రి గారికి కరీముల్లా కు టుంబం కృతజ్ఞతలు తెలిపారు.