Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rajnath Singh : రాజ్ నాథ్ సింగ్ అబద్ధాలు ఆపండి

–అమరవీరుల గ్రామాలను సంద ర్శించండి, చరిత్రను తెలుసుకోండి

–సిపిఐ (ఎం) పొలిట్ బ్యూరో మా జీ సభ్యురాలు బృందాకరత్

–నల్లగొండలో ముగిసిన రైతాంగ సాయుధపోరాట వారోత్సవాలు

–రాబోవు రోజుల్లో ఎర్రజెండా నీడ లో మరిన్ని పోరాటాలకు పిలుపు

–అమరవీరుల కుటుంబ సభ్యుల కు సన్మానం

Rajnath Singh : ప్రజా దీవెన,నల్లగొండ: భూమికోసం భుక్తి కోసం అలనాడు జరిగిన తెలం గాణ రైతాంగ సాయుధ పోరాట చ రిత్రను వక్రీకరించి అబద్ధపు ప్రచారా న్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆపాలని సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు అఖిల భారత నాయకురాలు బృందాకరత్ హితవు పలికారు. నల్లగొండ పట్ట ణంలో బుధవారం సుభాష్ విగ్రహం సెంటర్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన జరిగి న తెలంగాణ రైతాంగ సాయుధ పో రాట వారోత్సవాల ముగింపు సభ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రైతాంగ సాయుధ పోరా ట లో పాల్గొన్న అమరవీరుల కు టుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో సెప్టెంబర్ 17 లిఖిం చ బడ్డదని పేర్కొన్నారు.

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సం స్థానానికి సెప్టెంబర్ 17న 1948 నాడు ఇండియన్ యూనియన్ లో విలీనమైంది. ఒక సంవత్సరం కా లం పాటు జరిగిన పరిణామాలను వక్రీకరించి రకరకాలుగా ప్రచారం చే స్తున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి హైదరాబాద్ కు వస్తూ వస్తూ తనతో పాటు పెద్ద అ బద్ధాలు తయారు చేసే యంత్రాం తె చ్చారని ఎద్దేవా చేశారు. అది

నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో తయారైందని ఆరో పించారు.

తెలంగాణ ప్రజల ముందు అబద్ధా లు తయారు చేసే మిషన్ ని ప్రవేశ పెట్టబోతున్నారు. వారు చెప్పే కథ ఏంటంటే వీర తెలంగాణ పోరాటం ముస్లిం రాజు, హిందువులకు మ ధ్య జరిగిన పోరాటమని చిత్రీకరిం చి ప్రచారం చేస్తున్నారు. అదే క్రమం లో భారత దేశంలో మరో ప్రాంతం సైతం ఉందని జమ్మూ అండ్ కాశ్మీర్ విలీనం అయిందని, అక్కడ రాజు హరి సింగ్ హిందు ప్రజలు ముస్లిం లని మరి అక్కడ ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు.

భారత స్వతంత్ర సంగ్రామంలో బిజె పి కి గాని ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని, వారి పాత్ర కూడా ఏం లేదని దేశంలో ఉన్న ముస్లిం లు, హిందువులు, సిక్కులు,సబండ వర్గాలు స్వాతంత్రం కోసం మూడు రంగుల జెండా, ఎర్ర జెండా నీడలో పోరాటం చేస్తూ వచ్చారని చెప్పా రు. ఆ సమయంలో బిజెపి, ఆర్ఎ స్ఎస్ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించా రు. నేడు తెలంగాణకు వచ్చినా హిందూ, ముస్లింల పోరాటమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. అసలు వి ముక్తి గూర్చి బిజెపి వాళ్లకు ఏం తెలుసు అని నిలదీశారు.

విముక్తి అంటే 3000 గ్రామాలలో రై తులు, కూలీలు, సబండవర్గాలు ఎ ర్ర జెండా నీడలో పరిగెత్తి పోరాటం చేసి ఆనాటి రాజు, జమీందారులు అణచివేతకు గురి చేశారు. వాళ్లంద రిపై పోరాటం చేసి స్వాధీనం చేసు కున్నారు. అది విముక్తి అని అది తె లుసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. ఆరోజు రెండు రకాల హిం దూ, ముస్లింల ఐక్యత కనబడేదని పేద రైతులు, ముస్లింలు ఐక్యత క నిపించింది రెండో రకం దోపిడిదా రులైన భూస్వాములు, జమీందా రులు వారి ఐక్యత కనిపించిందని వివరించారు. అనాడు అతిపెద్ద దోపిడిదారుడు నైజాం అని పేర్కొ న్నారు.

నైజాంతోపాటు లక్షలాది ఎకరాలు భూములను చేతిలో పెట్టుకున్నటు హిందూ దోపిడిదారులు, భూస్వా ములు ఉన్నారని వారు పేద ప్రజల పై దోపిడీ దౌర్జన్యం సాగించారని వా రిపై జరిగిన పోరాటమే వీరసాయు ధ తెలంగాణ పోరాటమని ఆమె వ ర్ణించారు. వర్గ స్వభావంతో దోపిడి గురవుతున్న వారందరూ ఒకట య్యారని అలా సాగిన పోరాటమే సాయిధ తెలంగాణ పోరాటమని చెప్పారు.

ఈరోజు రక్షణ శాఖ మంత్రి చిట్యాల ఐలమ్మ జన్మించిన గ్రామాన్ని సంద ర్శించాల్సిన అవసరం ఉందని ఆ యనను అక్కడ తీసుకెళ్లాలని సూ చించారు. 1952 మొట్ట మొదటి సారిగా జరిగిన పార్లమెంట్ ఎన్ని క ల్లో రావి నారాయణరెడ్డి అద్భుత మైన మెజార్టీతో ఎన్నికల కావడం తో దేశం మొత్తం ఒక్కసారిగా తె లంగాణ వైపు చూసింది. తెలంగా ణ సాయుధ పోరాటం ఫ లితంగా నెహ్రూ కంటే అధిక మె జారిటీతో గెలిచారని వివరించారు. రాబోయే రోజుల్లో దేశాన్ని విచ్చినం చేయడా నికి ప్రయత్నం చేస్తున్న దు ష్టశక్తుల కు వ్యతిరేకంగా ఎర్రజెండా నీడలో మరింత పోరాటం చేయాల్సిన అవ సరం ఉందన్నారు.

సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యు లు చెరుపల్లి సీతారాములు మా ట్లా డుతూ బిజెపి వారు హిందూ, ము స్లిం మధ్య జరిగిన కొట్లాటగా చిత్రీ కరించి దాన్ని మతం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేసిన సందర్భం ఇది అ న్నారు. భవిష్యత్తులో మరిన్ని పోరా టాలు చేయాల్సిన అవసరం ఎంతై నా ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కా ర్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర నా యకులు బొంత చంద్రారెడ్డి, సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జు న, కందాల ప్రమీల, సయ్యద్ హ షం, పాలడు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, వి. వెంకటేశ్వర్లు, ఎండి. సలీం, దండంపల్లి సత్తయ్య, కొండ అనురాధ, నన్నూరు వెంకట రమణారెడ్డి, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.