Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా

–అధైర్య పడకండి అండదండగా నిలుస్తా

–మీ సమస్యలు వినడానికి ఎక్కడి కైనావస్తా

–గన్ పార్కు వద్ద నిరుద్యోగులతో కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నిరుద్యో గులకు ప్రభుత్వానికి వారధిగా ఉం టా, నిరుద్యోగులు అధైర్య పడకం డి, నిరసనలు ధర్నాలు మానుకోం డి, మీ సమస్యలు వినడానికి అవ సరమైతే అశోక్ నగర్ చౌరస్తా కి, సెంట్రల్ లైబ్రరీకి దిల్ సుఖ్ నగర్ కైన వస్తానని మునుగోడు ఎమ్మె ల్యే కో మటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హామీ ఇ చ్చారు. నిరుద్యోగుల ఆహ్వానం మే రకు హైదరాబాదులోని గన్ పార్క్ లో నిరుద్యోగులతో కలిసి అమర వీరుల స్తూపానికి బుధవారం నివా ళులర్పించిన మునుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రె డ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ని రుద్యోగులు పోషించిన పాత్ర వెల కట్టలేనిదని అన్నారు. పదేళ్లలో ని రుద్యోగుల కలలు కల్లలుగానే మిగి లిపోయాయని ఆవేదన చెందారు. పదేళ్ల పాలనలో ఒక గ్రూప్ వన్ కూ డా వేయలేకపోయారని పేర్కొన్నా రు. బిఆర్ఎస్ పాలన కుటుంబ పా లనగా కొనసాగి అవినీతిమయం గా మారి దోచుకుని అప్పులపాలు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒ క్కరికి న్యాయం జరగలేదని అన్నా రు.

తెలంగాణ యువత కేసీఆర్ ను ఫా మ్ హౌస్ కు పంపించడానికి పోషిం చిన పాత్ర అమోఘమైనదని అన్నా రు. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50 వే ల ఉద్యోగాలు భర్తీ చేశాం. నిరు ద్యో గులకు అండగా ఉంటా అధైర్య ప డకండి. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆ ర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఇది ప్రజల ప్రభుత్వం సె ప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవం గా జరుపుకుంటున్నా మని తెలిపారు.

సోనియాగాంధీ కలలు కన్న తెలం గాణ రాష్ట్రం పదేండ్ల కాలంలో స కారం కాలేదని అన్నారు.రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వ స్తాయి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉ ద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయినా ప్రభుత్వ ఉద్యో గాల తో పాటు చదువుకున్న యు వత తమ కాళ్ళ మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తామని హా మీ ఇచ్చారు. మీకు న్యాయం జ రిగే వరకూ మీ సమస్యలను ము ఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తా నని తెలిపారు.

ప్రభుత్వానికి నిరుద్యోగులకు మ ధ్య వారధిగా పని చేస్తానని, ని రు ద్యోగులకు ధైర్యం చెప్పడానికి ఇక్క డికి వచ్చా, నిరుద్యోగులు అధై ర్య పడకండి. మీ సమస్యలు వినడా నికి అవసరమైతే ఎక్క డికైనా వస్తానిరసనలు, నిర్బంధాలు, ధర్నాలు అవసరం లేదు. మీ సమ స్యలని ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.