CM Revanth Reddy : యూకే తెలంగాణ విద్యార్ధులకు తీ పికబురు, చెవెనింగ్ స్కాలర్‌షిప్ ల ను మెరిట్ విద్యార్థులకు అందించేం దుకు అంగీకారం
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్‌షి ప్ విషయంలో కో-ఫండిం బిగ్ ప్రాతి పదికన తెలంగాణ మెరిట్ విద్యార్థు లకు అందించాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి బ్రిటిష్ హైక మిషనర్ లిండీ కామెరాన్ సూత్రప్రా యంగా ఆంగీకరించారు. భారత బ్రి టిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ గురువారం జూబ్లీ హిల్స్ నివాసం లో ముఖ్యమంత్రితో మర్యాద పూ ర్వకంగా భేటీ అయ్యారు. వారితో పాటు డిప్యూటీ హైకమిషనర్ (హై దరాబాద్) గారెత్ విన్ ఓవెన్, పొలి టికల్ ఎకానమీ సలహాదారు నళిని రఘురామన్ కూడా ఉన్నారు.
యూకే ప్రభుత్వం అంతర్జాతీయ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా అందిస్తున్న చెవెనింగ్ స్కాలర్‌షిప్ లను కో-ఫండింగ్ ప్రాతిపదికన తె లంగాణకు చెందిన మెరిట్ విద్యా ర్థులకు అందించడానికి ఈ సంద ర్భంగా అంగీకరించారు. విద్య, సాం కేతిక సంబంధిత రంగాల్లో సహకా రం అందించడానికి సిద్ధంగా ఉన్న ట్టు ముఖ్యమంత్రికి వివరించారు.
యూకేలోని యూనివర్సిటీల్లో చదు వుకునే తెలంగాణ విద్యార్థుల సౌక ర్యార్థం అక్కడి వర్సిటీలు అడ్మిష న్లు, ఇతరత్రా కార్యక్రమాలను హై ద రాబాద్ నుంచి ఆపరేట్ చేసేలా చూ డాలని ముఖ్యమంత్రి కోరారు. తె లంగాణలో కొత్తగా తీసుకురానున్న ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా గురించి ముఖ్యమంత్రి బ్రిటిష్ హైక మిషనర్ కి వివరించారు. రాష్ట్రం లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ అందించడానికి లిండీ కామెరాన్ సుముఖత వ్యక్తం చేశారు.
అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభి వృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వా ములు కావాలని, ప్రధానంగా జీసీ సీ, ఫార్మా, నాలెడ్జ్ సెంటర్లు, వివిధ అకాడమీలకు సంబంధి త రంగాల్లో పెట్టుబడులను ప్రోత్స హించాలన్న ముఖ్యమంత్రి విజ్ఞప్తి పట్ల బ్రిటిషన్ హైకమిషనర్ సానుకూలంగా స్పం దించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొ న్నారు.