Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Tripathi : నల్లగొండజిల్లా కలెక్టర్ త్రిపాఠి కీలక ప్రకటన,ఇరిగేషన్ ప్రాజెక్టులు, అభి వృద్ధి పనులకు వంగమర్తి ఇసుక రీ చ్ లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక

Nalgonda District Collector Tripathi :

ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగ మర్తి ఇసుక రీచ్ లో పూడిక ద్వారా తీసి న 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసు కను ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇం దిరమ్మ ఇండ్లు, ఇతర అభివృద్ధి ప నులకు వినియోగించుకునేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమా వే శం తీర్మానించింది.ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన శు క్రవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వ హించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా రు.

గత మే నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో వంగమర్తి ముంపు ప్రాంతంలో సుమారు 8 లక్షలు ఇసుకను పూడిక తీత ద్వా రా తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు వినియోగించు కోవాలని ఉత్తర్వులు ఇవ్వడం జరి గింది.

అయితే ఇరిగేషన్ ప్రాజెక్టుల కు ఈ ఇసుకను ఇప్పటివరకు వినియో గించుకోనందున దాన్ని సద్వి ని యోగం చేసుకునే విషయమై క మి టీ చర్చించి ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను రాష్ట్రంతో పాటు, జిల్లాలో మౌలిక సదుపా యాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వినియో గించుకునేలా నిర్ణయం తీసుకుంది. ఈ ఇసుకను టీజీ ఎండీసీకి బదలా యించడం ద్వారా టీజీఎండిసి నుం డి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు, సాండ్ బజార్ కు కేటాయిం చేలా తీర్మానించారు.

దీంతోపాటు జిల్లాలో మరో ఐదు ఇ సుక రీచ్ ల ను గుర్తించి వాటి ద్వా రా ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఇ చ్చేందుకు సమావేశం చర్చించింది. బ్రాహ్మణపల్లి తాండ, వావిల్ కోల్ రీచుల నుండి డిండి, చందంపేట, పెద్దవూర, పీఏ పల్లి, కొండమల్లేపల్లి మండలాలలోని ఇందిరమ్మ ఇండ్ల కు ఇసుక సరఫరాకు తీర్మానిం చిం ది. కనగల్ మండలం ఎం. గౌరారం నుండి అనుముల, గుర్రంపోడు, పె ద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపు రారం, కనగల్ మండలాలలోని ఇం దిరమ్మ ఇండ్లకు ఇసుకనిచ్చేందుకు నిర్ణయించింది. వంగమర్తి, చిత్తలూ రు మూసిఎగువ ప్రాంతం నుండి తీ సిన ఇసుకను కేతేప ల్లి ,కట్టంగూర్, నకిరేకల్, మండలాలలో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకనివ్వాలని నిర్ణయిం చారు.

తాటికల్ లో గత ఫిబ్రవరిలోనే ఏ ర్పాటుచేసిన ఇసుకరీచ్ నుండి తక్ష ణమే ఇసుకను సరఫరా చేసేందుకు రెవెన్యూ, పోలీస్ ,మైన్స్ శాఖ సహ కారంతో ఇసుకను సరపరాలు చే సేందుకు గాను సమావేశం అంగీ కరించింది. చిట్యాల లో ఉన్న ఇ సుక కొరతను తీర్చేందుకు వెంటనే అవసరమైన ఇసుకను సరఫరా చే సేందుకు తగు చర్యలు తీసుకునే లా సమావేశం ఆమోదించింది.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, మైన్స్ ఏడి శామ్యూల్ జాక బ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, టి జి ఎం డి సి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.