Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అ భ్యంతరం, హరీష్ రావు వ్యాఖ్యలు అన్నీ అబద్ధాలు ఆవాస్తవాలు

Minister Uttam Kumar Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వ రం ప్రాజెక్టు తమ్మిడిహట్టి వద్ద బ్యా రేజ్ నిర్మాణానికి 35 వేల కోట్లు, సా గులోకి 4.47 లక్షల ఆయకట్టు అం టూ బి.ఆర్.యస్ నేత మాజీ మం త్రి హరీష్ రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కు మార్ రెడ్డి తేల్చి చెప్పారు. తమ్ము డిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాల ని, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మా ణం పనులను పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మా ట వాస్తవమే నన్నారు.

ఈ మేరకు శుక్రవారం సాయంత్రం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచి వాలయములో ఆయన ఒక ప్రక టన విడుదల చేశారు.అయితే హరీ ష్ రావు చెబుతున్నట్లుగా 35 వేల కోట్లతో తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణం,4.47 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అని చెబుతున్నదాంట్లో అణువంతు నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.అది పూర్తిగా నిరా ధారపూరితమైనదని,ఆయన మాటలు సత్యదూరమైనవని, ఆ యన మాటలు పూర్తి అబద్దాలు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం ఇప్పటి వరకు బ్యారేజ్ ని ర్మాణానికి సంబంధించిన అంచాన ల ప్రక్రియనే మొదలు పెట్టలేదని, అటువంటప్పుడు హరిష్ రావు ఇవీ అంచనాలు అంటూ ఎలా నిర్దారణ కు వచ్చారని ఆయన సూటిగా ప్ర శ్నించారు. అన్నింటికీ అతి తెలివి తేటలు వినియోగించ కూడదని, ఇటువంటి అతితెలివి తేటలతో ప్ర జా క్షేత్రంలో అభాసు పాలవుతారని హరీష్ రావు కు మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి హితవు పలికారు.

సత్యదూరమైన ఇటువంటి ప్రకట నలు హరీష్ రావు అతతెలివి తే టలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఇటువంటి ప్రకటనల పట్ల తెలం గాణా సమాజం అప్రమత్తంగా ఉం డాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ్మడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్ ల నిర్మణా లకు సంబంధించిన అంచనాలు రూపొందించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటి స్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ ర్యంలోనీ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శ కంగా పని చేస్తోందని ఆయన పేర్కొ న్నారు.రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాం గానికి సాగు నీరు,ప్రజలకు సాగు నీరు అందించేందుకు పెండింగ్ ప్రా జెక్టుల నిర్మాణాలు వేగవంతం చేశా మని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.