Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు, సిం గ‌రేణి సాధించిన విజయాల ఆధా రంగా కార్మికులకు 34 శాతం బోనస్

CM Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా సింగ‌రేణి కా ర్మికులకు వరుసగా రెండో ఏడాది ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుభ వా ర్త అందించారు. గడిచిన ఏడాది కా లంలో సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌ డించిన లాభాలు, సాధించిన వి జ యాల ఆధారంగా కార్మికులకు 3 4 శాతం మేరకు బోనస్ ప్రకటించారు.

సింగరేణి కార్మికులకు బోనస్ అం దించాలన్న అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లతో పాటు ఇతర మంత్రులు, సింగ రేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో చ ర్చించి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లా డు తూ సింగరేణి లాభాల్లో 34 శాతం మేరకు 819 కోట్ల రూపాయలను బోన‌స్‌ను ప్రకటించారు.

తాజాగా ప్రకటించిన బోనస్ వల్ల ప్ర తి కార్మికుడికి 1,95,610 రూపాయ ల చొప్పున ప్రయోజనం చేకూర నుంది. గతేడాది తొలిసారిగా కాం ట్రాక్ట్ కార్మికులకూ రూ. 5 వేల చొ ప్పున బోనస్ అందజేయగా, ఈసా రి రూ. 5,500 చొప్పున బోనస్ చె ల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్య మంత్రి చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నులు పో గా సింగరేణి 6,394 కోట్ల మేరకు లాభాలను గడించగా, అందులో సింగరేణి సంస్థ విస్తరణకు 4,034 కోట్లు కేటాయించారు. మిగిలిన 23 60 కోట్లను వివిధ రూపాల్లో కార్మి కుల సంక్షేమ కార్యక్రమాలకు విని యోగించడంతో పాటు, అందులో 3 4 శాతం మేరకు బోనస్ ప్రకటించా రు. మొత్తంగా దాదాపు 71 వేల మంది కార్మికులకు ప్రయోజనం చే కూరుతుంది.

దసరా పండుగను పురస్కరించు కుని ఈ బోనస్ ప్రకటించగా దీ పా వళి పండుగ సందర్భంలో బోనస్‌కు సంబంధించి మరో ప్రకటన చేస్తా మని తెలియజేశారు. సింగరేణి అ భివృద్ధిలో సహకరించిన కార్మిక సం ఘాలకు ఈ సందర్భంగా ధన్యవా దాలు తెలిపారు.తెలంగాణ సాధన ప్రక్రియలో సింగరేణి (Singareni) కార్మికుల త్యాగం, శ్రమ, చరిత్ర ఎ ప్పటికీ మరువలేమని ఈ సందర్భం గా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తె లంగాణ ఉద్యమం ఉధృతంగా సా గుతున్న దశలో బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధ న ప్రక్రియలో సింగరేణి కార్మికులు ప్ర త్యేకమైన పాత్ర పోషించారని అ న్నారు. తెలంగాణలో వారి భాగ స్వామ్యాన్ని ప్రభుత్వం ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంటుందని చెప్పారు.

బొగ్గు గనుల ద్వారా సింగరేణి మొ త్తం జాతికే వెలుగులు అందిస్తోంద ని, దేశంలో పరిశ్రమలు లాభసాటి లో నడుస్తున్నాయంటే కార్మికుల శ్ర మ ఎంతో ఉందన్నారు. అత్యంత కీ లక పాత్ర పోషిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటాలను పంచాలని నిర్ణ యించామని అన్నారు.శ్రమ శక్తిని నమ్ముకున్న కార్మికులకు లాభాల్లో వాటాలను పంచడంతో పాటు సం స్థ భవిష్యత్తు ప్రణాళికలు, విస్తరణ కార్యక్రమాలు, కార్పొరేట్ రంగంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కార్మికుల సంక్షేమం, అభి వృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీ సుకుంటామని తెలిపారు. సింగరేణి సంస్థ కార్పొరేట్ రంగంతో పోటీ పడి తలెత్తుకునేలా భవిష్యత్తు పెట్టుబ డులు, ప్రణాళికలతో ముందుకు వె ళ్లే విషయంలో కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో టెండర్ల లో పాల్గొనకపోవడం వల్ల కోల్పో యిన రెండు గనులను తిరిగి సింగ రేణి ఆధ్వర్యంలోకి తీసుకొచ్చే విష యంలో అన్ని మార్గాలను అన్వేషి స్తామని స్పష్టం చేశారు.ప్రస్తుత పో టీ ప్రపంచంతో సింగరేణి కూడా పో టీ పడుతుందని, ఆయాచిత లబ్ది కోసం ప్రయత్నించడం లేదని ము ఖ్యమంత్రి చెప్పారు. సింగరేణి మ నుగడ, లాభాల ఆర్జన, ప్రపంచంతో పోటీ పడటం వంటి కీలక అంశాలపై కార్మికులు, ప్రజాప్రతినిధులు, ప్రభు త్వ అధికారులు సమాలోచనలు చే సి పటిష్టమైన ప్రణాళికలతో ముం దుకు పోతామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రం దాదాపు 7 వేల కోట్ల మేరకు ఆ దా యం కోల్పోతోంది. ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమం త్రి డిమాండ్ చేశారు. జీఎస్టీ (GST) సవరణలతో ఏర్పడిన వ్యత్యాసా న్ని పూరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ వి షయంలో ఉప ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారని చెప్పా రు.

మీడియా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ వెంకట స్వామి, సలహాదారులు వేం న రేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, ఎంపీలు పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురామి రెడ్డి, సింగరేణి ప్రాంత ఎ మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.