Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక నిర్ణయం, ఆసి యా ఖండంలోనే అతిపెద్ద‌దైన మే డారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌ను మ‌రిం త ఘ‌నంగా నిర్వ‌హించాలని ము ఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయిం చారు. జాత‌ర ఏర్పాట్లపై ప్రత్యేక శ్ర‌ ద్ధ వ‌హిస్తున్న ముఖ్యమంత్రి మంగ‌ ళ‌వారం రోజు ప్రత్యక్షంగా మేడారం క్షేత్రస్థాయిలో సంద‌ర్శించనున్నారు.

మేడారం జాత‌ర‌ కోసం గతంలో తా త్కాలిక ఏర్పాట్లు జరిగేవి. మేడారం ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన అ భివృద్ధి పనుల కోసం వంద రోజుల కార్యాచరణను నిర్ధేశించిన ము ఖ్య మంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో స మీక్షించనున్నారు.

మేడారం పూజ‌రులు, ఆదివాసీ పె ద్ద‌లు, మంత్రులు, గిరిజ‌న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌ ముఖుల‌తో జాత‌ర నిర్వహణ, కొత్త నిర్మాణాల‌పై మేడారంలో స‌మీక్షిస్తా రు.ఆదివాసీ సంప్ర‌దాయాల‌కు పెద్ద పీట వేస్తూ ఇల‌వేల్పులు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌ రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణాన్ని లక్ష లాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌భుత్వం శ్రీ‌ కారం చుడుతోంది.కోట్లాది భ‌క్తులు వ‌చ్చే జాత‌ర ప్రాశ‌ స్త్యానికి త‌గ్గ‌ట్లు భారీ ఎత్తున స్వాగ‌ త తోర‌ణాల నిర్మాణంతో పాటు గ‌ ద్దెల వ‌ద్ద‌కు భ‌క్తులు సులువుగా చే రుకోవడం గ‌ద్దెల ద‌ర్శ‌నం, బంగారం (బెల్లం) స‌మ‌ర్ప‌ణ‌, జంప‌న్న వాగులో స్నా నాలు ఆచరించేందుకు అవ‌ స‌ర‌మై న ఏర్పాట్లు చేయ‌నున్నారు.

మేడారం అభివృద్ధి ప‌నుల్లో గిరిజ‌న సంప్ర‌దాయాలు, విశ్వాసాల‌కు ఎ టువంటి భంగం క‌ల‌గ‌వ‌ద్ద‌నే కృత‌ని శ్చ‌యంతో ఉన్న ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌ తి నిర్మాణం, ప్ర‌తి క‌ట్ట‌డాన్ని పూర్తి గా ఆదివాసీ సంప్ర‌దాయాల‌కు అ నుగుణంగా, మేడారం జాత‌ర పూ జారులు, ఆదివాసీ పెద్ద‌ల‌ సూచ‌న లతో ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నుంది. నిర్మా ణాల్లో విలువైన గ్రానైట్‌, లైమ్‌స్టోన్ రాళ్ల‌ను వాడ‌నున్నారు. పురాత‌న ఆల‌యాల పునఃనిర్మాణం, ప్ర‌సిద్ధ ఆల‌యాల అభివృద్ధి ప‌నుల్లో ప్ర‌సి ద్ధుడైన స్తప‌తి ఈమ‌ని శివ‌నాగిరెడ్డి సేవ‌ల‌ను మేడారం అభివృద్ది ప‌ను లకు ప్ర‌భుత్వం వినియోగించుకుం టోంది.

గ‌తంలో ముఖ్య‌మంత్రులు, మంత్రు లు జాత‌ర‌కు వెళ్ల‌డం, ద‌ర్శ‌నాల‌తో స‌రిపుచ్చేవారు. ఈసారి అందుకు భిన్నంగా ప్ర‌పంచ ప‌టంలో జాత‌ర‌ కు మ‌రింత వ‌న్నె తేవాల‌ని ముఖ్య‌ మంత్రి సంక‌ల్పించారు. ఆదివాసీల సంప్రదాయాలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా మేడారం జాత‌రను అభివృ ద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చే యాలని ఇటీవలే అధికారులను ఆ దేశించారు. రెండేళ్లకోసారి జరిగే మ హా జాత‌రతో పాటు ఏడాది పొడవు నా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గ ద్దెలను దర్శించుకునే భ‌క్తుల సంఖ్య పెరిగింది.

వారాంతం, ఇతర సెలవు దినాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతోంది. పె రుగుతున్న భక్తుల రద్దీకి అనుగు ణంగా అవ‌స‌ర‌మైన వ‌స‌తి, సదుపా యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సా రించింది.మేడారం అభివృద్ధి ప‌ను లతో ఆదివాసీ సంస్కృతి, సంప్ర‌దా యాల‌కు పెద్ద పీట వేయటంతో పా టు ఆధ్యాత్మిక ప‌ర్యాట‌కానికి ప్ర‌ భు త్వం ఊత‌మివ్వ‌నుంది. ఫ‌లితంగా మేడారం సమీపంలో ఉన్న రామ‌ ప్ప‌, ఇత‌ర ఆల‌యాల‌కు భ‌క్తుల సం ఖ్య పెరిగి స్థానికులకు ఉపాధి అవ‌ కాశాలు మెరుగుప‌డ‌నున్నాయి.