CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ప్రకటన, ఆదివా సీ సంస్కృతి, సంప్రదాయాల మేరకే మేడారం ఆలయ అభివృద్ధి
CM Revanth Reddy : ప్రజా దీవెన, వరంగల్: ఆదివాసీ ఆ చార వ్యవహారాలు, సంస్కృతి, సం ప్రదాయాల మేరకే మేడారం ఆల య అభివృద్ధి కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరు ద్ఘాటించారు. రాబోయే వంద రోజు లు సమ్మక్క సారలమ్మ మాలధార ణ తరహా నిష్ఠతో ప్రతి ఒక్కరూ స మాఖ్యంగా పనిచేయాలని కోరారు. మేడారం అభివృద్ధి కి సమృద్ధిగా నిధులు విడుదల చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని, పనులు పూ ర్తి చేయించుకునే బాధ్యత మీపై ఉందని అధికారులకు సూచించా రు. మంగళవారం మేడారం ఆ ల య అభివృద్ధిపై సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా అలయ అభివృద్ధి, విస్తరణకు సం బంధించిన ప్రణాళిక, డిజైన్లను పూ జారులు, ఆదివాసీ సoఘాలకు అ ధికారులు వివరించారు. అదే సంద ర్భంలో ఆలయ పూజారులు, ఆది వాసీ సంఘాల ప్రతి నిధుల అభిప్రా యాలు సీఎం తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభి వృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేయాలని అధికా రులను ఆదేశించారు. ఆ టీమ్ ద్వా రా అభివృద్ధి చేయాలని సూచించా రు. వందరోజుల్లో అభివృద్ధి పను లు పూర్తయ్యేలా చూడాలని అధి కారులను ఆదేశించారు. ఆదివాసీ లు దేశానికి మూలవాసులని, పోరా టానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మ క్క, సారలమ్మలని పేర్కొన్నారు.
నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శిస్తు న్నానని,2023 ఫిబ్రవరి 6న ఈ గ డ్డమీద నుంచే పాదయాత్ర మొద లుపెట్టానని, సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్ప డిoదని గుర్తు చేశారు.
ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్ర భుత్వం సంకల్పించిందని, శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాలని తెలిపా రు.సంప్రదాయానికి గౌరవం ఇవ్వా లనే ఆలోచనతో మీ అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చా మ ని, సంప్రదాయంలో వీసమెత్తు కూ డా తేడా రాకుండా ఉండాలనేదే మా అభిమతమని, ఇది డబ్బుల తో కొలిచేది కాదన్నారు.నమ్మకంతో కొలిచేదని, ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలని సూ చించారు.
పూర్తి స్థాయిలో రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని అధికారుల కు సూచించామని, ప్రపంచంలో ఎ క్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క సారలమ్మ ఆల యం ఉందని వ్యాఖ్యానించారు.
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, ఆలయ అభివృద్ధి లో భాగస్వాములైన వారి జన్మ ధ న్యమవుతుందన్నారు. ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిదని పేర్కొన్నారు.
ఆదాయం ఆశించి కాదని, భక్తితో పనిచేయాలని, ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ త రా లకు అందించేలా పనిచేయాలని స్పష్టం చేశారు. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపా రుదల శాఖ అధికారులు ప్రణాళిక లు రూపొందించాలని, అవసర మై నచోట చెక్ డ్యామ్ లు నిర్మించాల న్నారు.
ఈ సందర్భంగా మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం రే వంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంర క్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని సీఎం తెలిపారు.
ఆలయ విస్తరణ, మాస్టర్ ప్లాన్‌పై రే వంత్ రెడ్డి చర్చించారు. 2026 మ హాజాతరకు ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదే శాలు జారీ చేశారు.మేడారం ఆల య విస్తరణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశా రు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటునే విస్తరణ ప్రక్రి యను కొనసాగించాలని సీఎం తె లిపారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అనంతరం సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణం విస్తరణ, పునఃనిర్మాణం చేయనున్న పనుల ను ఆయన పరిశీలించారు. ఈ మే రకు అమ్మవార్లకు సీఎం రేవంత్ రెడ్డి 68 కేజీల బంగారం సమర్పిం చి, ప్రత్యేక పూజలు నిర్వహించా రు.
మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆ లయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష స మావేశoలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీత క్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు బల రాం నాయక్, కడియం కావ్య, ఉ న్నతాధికారులు పాల్గొన్నారు.