Ex CM cinima heroine JayaLalitha : జయలలిత బంగారం ఎవరికిచ్చారో ఎరుకెనా
--తమిళనాడు మాజీ సిఎం జయలలిత కేసులో కోర్టు తీర్పు --ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తామని వెల్లడి
జయలలిత బంగారం ఎవరికిచ్చారో ఎరుకెనా
–తమిళనాడు మాజీ సిఎం జయలలిత కేసులో కోర్టు తీర్పు
–ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తామని వెల్లడి
ప్రజా దీవెన/ బెంగుళూర్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు విషయంలో బెంగుళూరు కోర్టు సంచలన తీర్పు ( Bengaluru court’s sensational verdict in Jayalalithaa’s case) వెలువరించింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అటు రాజకీయాల్లోనూ, ఇటు సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే.
తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈమెకు లెక్కకుమించి ఆస్తులున్నాయనే విషయం కూడావిదితమే. ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తులు వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చర్చకు వచ్చింది. అయితే తాజాగా బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు జయలలితకు సంబంధించిన వజ్రాభరణాల గురించి (36th City Civil Court, Bengaluru regarding diamond jewelery belonging to Jayalalithaa) కీలక నిర్ణయం తీసుకుంది.
జయలలిత 27 కిలోల బంగారం ప్రభుత్వానికి అప్పగిస్తూ బెంగళూ రు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జయలతితకు చెందిన 27 కిలోల బంగారం, వజ్రాభరణాలను ( 27 kg of gold and diamond jewelery belonging to Jayalathita) ఈ ఏడాది మార్చి 6, 7 తేదీల్లో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తామని బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు సోమవారం ప్రకటించింది.
అవినీతి కేసులో జయల లిత దోషిగా తేలి నాలుగేళ్ల జైలు శిక్ష అను భవించిన దాదాపు పదేళ్ల తర్వాత, ఆమె మరణించిన ఏడేళ్ల తర్వా త ఈ నిర్ణయం ( The decision comes seven years after her death) తీసుకోవ డం గమనార్హం. జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేయడ మే ప్రత్యేక కోర్టు ప్రస్తుత విచారణలో ఉంది. ఆభరణాలను వేలం వేసిన తర్వాత కోర్టు ఆమె స్థిరాస్తులను వేలానికి తీసుకురానుంది.
20 కిలోల నగలను అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా జరిమా నా వసూలు చేయనుండగా 7 కిలోలు ఆమె తల్లి నుంచి వారసత్వం గా వచ్చినవిగా భావించి మినహాయింపు (7 kg is deemed to be inherited from her mother and is an excepti on) ఇవ్వనున్నారు. జయలలి తకు ఖాతా ఉన్న కాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సోమవారం బెంగళూరు లోని ప్రత్యేక కోర్టుకు దాదాపు రూ.60 లక్షలను అందజేసింది.
తాను గతంలో ఆదేశించిన విధంగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ (డీవీఏసీ) ఇన్స్పెక్టర్ జనరల్ బెంగళూరు కోర్టుకు వచ్చి బంగారు, వజ్రాభరణాలు స్వీకరించాలని తమి ళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 16న జీవో జారీ చేసింది.
ఈ కోర్టు నుంచి నగలు సేకరించడానికి అధికారులు ఒక ఫోటోగ్రాఫ ర్, వీడియోగ్రాఫర్ అవసరమైన భద్రతతో ఆరు పెద్ద ట్రంకులను తీసుకురావాలని న్యా యమూర్తి చెప్పారు. నగలను తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకు ఆ రెండు రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించారు.