Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఇంటి పార్టీకి షోకాజ్ నోటీసులు, వచ్చేనెల 8న వాదనలు వినిపించేందుకు అవకా శం
–హియరింగ్ కు హాజరు కాకపోతే చెప్పుకోవాల్సింది ఏమీ లేదని భా వించాల్సి వస్తుంది
— ఉత్తర్వుల్లో పేర్కొన్న రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి
–వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: భారత రా జ్యాంగం ఆర్టికల్ 324, ప్రజాప్ర తి నిధ్య చట్టం 1951, సెక్షన్ 29 ఏ ప్రకారం వార్షిక ఆడిట్ అకౌంట్స్, ఎ న్నికల ఖర్చుల లెక్కలను సకాలం లో సమర్పించనందుకుగాను తె లం గాణ ఇంటి పార్టీ ని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి ఎందుకు తొలగించ కూడదో తెలియజేయాలని కోరు తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా క లెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకట న లో తెలిపారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 324, ప్రజాప్రతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29 ఏ ప్రకారం ఎప్పటి కప్పుడు పార్టీకి సంబంధించిన వా ర్షిక ఆడిట్ అకౌంట్స్ తోపాటు, ఆ యా ఎన్నికల సందర్భంగా ఖర్చు చే సిన ఎన్నికల వ్యయాన్ని ఎన్నికల కమిషన్ కు ఎప్పటికప్పుడు సమ ర్పించాల్సి ఉంటుందని, అయితే తెలంగాణ ఇంటి పార్టీ 2021- 22, 2022-23, 2023 -24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వార్షిక ఆడిట్ అకౌంట్స్ ను నిర్దేశించిన స మయంలో సమర్పించలేదని, అలా గే అసెంబ్లీ ఎన్నికలు,లోక్ సభ ఎ న్నికల వ్యయానికి సంబంధించిన రి పోర్టులను కూడా నిర్దేశించిన సమ యంలో సమర్పించలేదని తెలిపా రు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎ న్నికల కమిషన్ భారత రాజ్యాం గం లోని 324 ఆర్టికల్ అలాగే ప్రజా ప్ర తినిధ్య చట్టం 1951, సెక్షన్ 29 ఏ ప్రకారం తెలంగాణ ఇంటి పార్టీని రి జిస్టర్డ్ రాజకీయ పార్టీల జాబితా నుండి ఎందుకు తొలగించకూడదో పూర్తి ఆధారాలతో రాతపూర్వకం గా అఫిడవిట్ తో సహా, పార్టీ అధ్య క్షులు, లేదా జనరల్ సెక్రెటరీ ఎవరో ఒకరు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎ న్నికల అధికారికి ఈనెల 29 లోగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సం ఘం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.
ఇదే అంశంపై అక్టోబర్ 8 న తెలంగా ణ ఇంటి పార్టీ తనవాదనలు విని పించేందుకు గాను ఒక అవకాశం ఇవ్వడం జరిగిందని, అట్టి హియ రింగ్ కు పార్టీ అధ్యక్షుడు, లేదా జన రల్ సెక్రెటరీ, లేదా పార్టీకి సంబంధిం చిన పెద్ద తప్పనిసరిగా హాజరుకా వాలని, ఒకవేళ షో కాజ్ నోటీస్ కు ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వకపోయి నా, హియరింగ్ కు ఎవరు హాజరు కాకపోయినా పార్టీ నుండి చెప్పు కోవాల్సిన, చెప్పుకోవాల్సింది ఏమీ లేదని కమిషన్ భావించవలసి వ స్తుందని ఆ షోకాజ్ నోటీసులో పే ర్కొన్నట్లు కలెక్టర్ తెలిపారు.