District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, తక్షణమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభిం చాలి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, మునుగోడు: మునుగో డులో నిర్మించనున్న యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠ శాల భవన నిర్మాణ పనులను తక్ష ణమే మొదలుపెట్టాలని జిల్లా కలెక్ట ర్ ఇలాత్రిపాఠి ఈడబ్ల్యుఐడీసీ ఇం జనీరింగ్ అధికారులను ఆదేశించా రు.గురువారం ఆమె మునుగోడు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్బం గా భూభారతి దరఖాస్తులు, భూ ములకు సంబంధించి న సమస్య లు, దరఖాస్తుల పరిష్కారం, తదిత ర వివరాలను తహసిల్దార్ నరేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.
వివిధ పనుల నిమిత్తం కార్యాల యానికి వచ్చే రైతులు, ప్రజల దర ఖాస్తులను ఎప్పటికప్పుడు పరి ష్క రించాలని, అదేవిధంగా ప్రజావాణి ఫిర్యా దులను సైతం ఎప్పటికప్పు డు పరిష్కరించాలని సూచించారు. అనం తరం జిల్లా కలెక్టర్ యoగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పా ఠశాల భవన నిర్మాణం చే ప ట్టనున్న స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పనులు ఇంకా ప్రా రంభం కానందున అక్కడినుండే ఈ డ బ్ల్యూ ఐడిసి ఇంజనీరింగ్ అధి కా రులతో ఫోన్ ద్వారా మాట్లాడి వెం టనే పాఠశాల నిర్మాణ పనులను మొద లు పెట్టాలని ఆదేశించారు.
స్థలానికి సంబంధించిన అడ్వాన్స్ పొజిషన్ వివరాలను జిల్లా కలెక్టర్ చండూ ర్ ఆర్డీవో శ్రీదేవిని అడిగి తె లుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ మె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలకు వెళ్లే ర హదారి, పరిసరాలను పరిశీలించా రు. చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మును గోడు తహసిల్దార్ నరేష్, ఎంపీడీవో యుగంధర్ రెడ్డి తదితరులు ఉ న్నారు.
*గట్టుప్పల్ తహసిల్దార్ కార్యాల యo ఆకస్మిక తనిఖీ…* జిల్లాలో నూతనంగా ఏర్పాటైన గట్టుపల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యా లయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అ ధికారులను ఆదేశించారు. గురు వా రం ఆమె గట్టుప్పల్ తహసిల్దార్ కా ర్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చే శారు.
గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆ యా ప్రభుత్వ కార్యాలయాల ని ర్మాణానికి స్థలాలను గుర్తించాలని, ఇదివరకే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, అయితే ప్రస్తుతం గు ర్తించిన స్థలం అనువుగా లేనందున మరో స్థలాన్ని వెంటనే గుర్తించి మ్యాప్ తో సహా సమర్పించాలని చండూర్ ఆర్డీవో శ్రీదేవిని ఆదేశిం చారు. స్థలం గుర్తింపు తర్వాత ఆ యా ప్రభుత్వ కార్యాలయాల భ వ నాల నిర్మాణానికి చర్యలు చేపట్ట డం జరుగుతుందని ఆమె తెలిపా రు.జిల్లా కలెక్టర్ వెంట చండూర్ ఆ ర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ రాములు, ఎంపీ డీవో వరలక్ష్మి తదితరులు ఉన్నారు.