MLA Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె డ్డి సంచలన వ్యాఖ్య, ఛిద్రమైన ఆ ర్థిక వ్యవస్థలో సంక్షేమపథకాలు కొనసాగిస్తున్నాo
MLA Komatireddy Rajagopal Reddy :
ప్రజా దీవెన, మునుగోడు: రాష్ట్రం లో ఓ వైపు ఛిద్రం చేసిన ఆర్థిక వ్య వస్థను చక్కదిద్ధుతూనే గత ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వైపు ఇచ్చిన హామీలను నెర వేరుస్తూనే అభివృద్ధి పనులు చేస్తు న్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు సన్నాహాలు ఉ పందుకున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రక్రియపై ము నుగోడులోని క్యాంపు కార్యాలయం లో గురువారం అందుబాటులో వు న్న నాయకులతో ఆయన సమావే శం నిర్వహించారు.
ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలకు చేరువైన సన్నబియ్యం పంపిణి, మ హిళలకు బస్సుల్లో ఉచిత ప్రయా ణం, 200 యూనిట్ల ఉచిత కరెం టు, రేషన్ కార్డుల పంపిణి, ఇంది ర మ్మ ఇల్లుల మంజూరు లాంటి ప థ కాల గురించి ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకెళ్లాలని సూచించారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరు స్తున్నప్పటికి కొన్ని పూర్తిగా నెరవే ర్చకపోవడానికి ఉన్న ఇబ్బందులను ప్రజలకు అర్థమయ్యే విదంగా వివ రించాలన్నారు.
గత పాలకులు చేసిన పాపాలకే ఇ పుడు ఇబ్బంది పడుతున్నామని, ప్రాజెక్టుల పేరు మీద చేసిన అప్పుల కు ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే వ్యవస్థను గాడిలో పెడుతున్న తీరు ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లుల మంజూరులో నెలకొన్న ఇబ్బందు లు అధిగమించడానికి నిబంధనల సడలింపు పై ప్రభుత్వంతో మాట్లా డి నిజమైన నిరుపేద అర్హులకు నా య్యం జరిగేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్థాయిలో నె లకొన్న సమస్యలు పరిష్కరించడా నికి అనుసరించాల్సిన అంశాల పై కూలంకషంగా చర్చించారు.ఈ స మావేశంలో వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొ న్నారు.