Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

High Court : బిగ్ బ్రేకింగ్, బీసీ రిజర్వేషన్లపై హైకో ర్టు కీలక వ్యాఖ్యలు,గవర్నర్‌ వద్ద బి ల్లు పెండింగ్‌లో ఉండగా జీవో జారీ చేయడమేంటి 

High Court : ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగా ణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్ళీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. శని వారం అత్యవసర విచారణ సమ యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చే సింది. గవర్నర్‌ వద్ద బిల్లు పెండింగ్‌ లో ఉన్న సమయంలో జీవో జారీ చే యడమెంటని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలను మరికొద్ది రోజులు వాయిదా వేసుకోవచ్చని సూచించింది.

ఇదిలా ఉండగా కోర్టుల జోక్యం లే కుండా ఉండాలంటే ప్రభుత్వం 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసు కోవచ్చని హైకోర్టు తన తీర్పులో పే ర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం తమ నిర్ణయం ఏమిటో స్ప ష్టంగా తెలియజేయాలని కూడా ఆ దేశించింది.

కోర్టు తీర్పు పూర్వాపరాలు ఇలా ఉ న్నాయి. బీసీ రిజర్వేషన్ లపై హై కోర్టు లో సుదీర్ఘ వాదనలు కొనసా గగా ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ ఇ వ్వలేదు కాబట్టి అత్యవసర లంచ్ మోషన్ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ వాదించగా వరు స సెలవు దినాలు ఉన్నందున ఒక సారి నోటిఫికేషన్ ఇష్యూ అయితే కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి పిటిషన్ ను విచా రిస్తున్నామని ధర్మాసనం అభిప్రా యపడింది.

పునర్విచారణ వరకు ఎన్నికల నో టిఫికేషన్ విడుదల చేయబోమని మీరు హామీ ఇస్తారా అంటూ అ డ్వ కేట్ జనరల్ కు కోర్టు వరుస ప్రశ్నలు వేసింది. దీంతో అలా హామీ ఇవ్వలే నని, అది ప్రభుత్వ నిర్ణయమని అ డ్వకేట్ జనరల్ కోర్టుకు విన్న విం చారు. ఈ క్రమంలో కోర్టు ప్రతి స్పం దిస్తూ అయితే 10నిముషాల సమ యం తీసుకొని ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని సూచిందింది.

దీనికి అడ్వకేట్ జనరల్ సమాధా నమిస్తూ 10ని తర్వాత ప్రభుత్వం నుంచి ఎవ్వరూ అందుబాటులోకి రావట్లేదoటూనే ఎన్నికల ప్రక్రియ 4 5 రోజులు ఉన్నందు వల్ల ఇంత అ త్యవసర విచారణ అవసరం లేదని

అయితే విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ ఈలోపు ఎ న్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నా ఈ కేసులో ఇచ్చే తీర్పుకు లోబ డే చెల్లుబాటవుతుందని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.