Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, డి సెంబర్ లోగా ఫ్యూచర్ సిటీ డెవ ల ప్మెంట్ భవనం, స్కిల్ యూనివర్సి టీని పూర్తిచేస్తాం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచబోతున్న ఫ్యూచర్ సి టీ చరిత్రలో ప్రత్యేక స్థానం సం పా దించుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యా నించారు. ఫ్యూచర్ సిటీకి కేంద్ర బిం దువుగా నిలిచే డెవలప్మెంట్ భవ నంను డిసెంబర్ లోగా పూర్తి చేస్తా మని, అదే సందర్భంలో స్కిల్ యూ నివర్సిటీని సైతం పూర్తి చేస్తామని సీఎం కీలక ప్రకటన చేశారు. డెవల ప్మెంట్ భవనం పూర్తి కాగానే అ ప్పు డు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపా లు నిర్వహిస్తామని చెప్పారు. ప్ర పంచంలో ఎవరు ఇక్కడ పెట్టుబ డులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యా లయంలోనే కూర్చుని మాట్లాడు తానని తెలిపారు. ప్రపంచాన్ని ఇ క్కడికే రప్పిస్తానని ఉద్ఘాటించారు.

సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణా నికి ఇక్కడ పది ఎకరాలు కేటా యిం చాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, శ్రీధర్ బాబులకు సూచన చేస్తున్నానoటూ, 2026 డిసెంబర్ లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూ ర్తిచేసుకునేలా చూడాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవల ప్మెంట్ అథారిటీ భవనం, గ్రీన్ ఫీల్డ్ రేడియ ల్ రోడ్ –1 నిర్మాణాలకు శంఖు స్థా పన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి ప్రసంగం యావత్తు ఆ యన మాటల్లోనే..

 

మంచి సంకల్పంతో తలపెట్టిన ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్స వానికి వరుణదేవుడు కూడా సహ కరించాడు.చాలా మంది కుట్రలు కు తంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చిం ది మాట్లాడుతున్నారు. ఇక్కడ నా కేదో భూములు ఉన్నాయని, అం దుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది నా కోసమో, నా కుటుంబం కోసమో కా దు, భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం. ఆనాడు కులీకుతుబ్ షా హై దరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారు. నిజాం కాలంలో సికింద్రా బాద్ ను అభివృద్ధి చేశారు.

ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో సై బరాబాద్, సిలికాన్ వ్యాలీ అభి వృ ద్ధి జరిగింది. గతం నుంచి మనం నే ర్చుకోవలసింది ఎంతో ఉంది. మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సి టీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.ప్రపంచ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించు కు నేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుం దాం. ఒక గొప్ప నగరాన్ని నిర్మించ డానికి ఉండాల్సిన అర్హతలన్నీ భార త్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.

ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీ పట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్ర భుత్వం అంగీకరించింది. ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబో యే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫా ర్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం. ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

ఇందుకు మీ అందరి సహకారం ఉం డాలి, చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం.ప్రభుత్వం ఉ దారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది.నేను కూర్చుని మీ స మస్యలను పరిష్కరించేందుకు సి ద్ధంగా ఉన్నా. రాజకీయ పార్టీల ఉ చ్చులో పడి కోర్టులకు వెళ్లి నష్టపో వద్దు. తక్షణమే మీ సమస్యలను పరిష్కరించాలని మా అధికారుల ను ఆదేశిస్తున్న. అందరికీ న్యాయం చేయాలనేదే మా ప్రయత్నమని పు నరుద్ఘాటించారు.

*భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సి టీలోనే ఉంది*….ఫ్యూచర్ సిటీ డె వలప్మెంట్ అథారిటీ భవన శంకుస్థా పన కార్యక్రమంలోడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సం బంధించిన పరిశ్రమలు, అంతర్జాతీ య స్టేడియం వంటి వాటితో అద్భు తమైన నగరంగా ఫ్యూచర్ సిటీ ని ర్మాణం జరగబోతోంది భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందన్నారు. ఈ దేశ భవిష్యత్తు అంతా ఈ ఫ్యూచర్ సిటీ చుట్టే తిరగబోతుందేమో అన్న భా వన తనకు కలిగిందన్నారు. ఎలి వేటెడ్ కారిడార్ లతో అద్భుతమైన రోడ్లు, మధ్యన మెట్రో రైలు దేశం లోని ఏ నగరానికి ఈ వ్యవస్థ లేదు అన్నారు.

హైదరాబాద్ ఇంటర్నే షనల్ ఎయి ర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీని కలు పుతూ రోడ్డు వేయడం, ఫ్యూచర్ సి టీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అ మరావతిని కలుపుతూ బందర్ పో ర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఢిల్లీ వెళ్లి నప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడి మంజూరు చేయించుకుని వచ్చాన ని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే… ఆ పనులకు సంబంధించిన ఫో టో లు చూస్తుంటే చాలా సంతోషం వే సింది అన్నారు. ఫ్యూచర్ సిటీ నుం చి బెంగళూరుకు రోడ్డు ఈ పను ల న్నీ చూస్తుంటే ఇది ఒక మహా అ ద్భుతంగా మారే నగరంగా రూపు దిద్దుకోబోతుందని అన్నారు.

 

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు ఒ రి జి నల్ సిటీ అని దీన్ని అద్భు తంగా అ భివృద్ధి చేస్తున్నామని నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి తెల్లవా రుజామునే భవిష్యత్తు నగరానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని చే పట్టారని వివరించారు. 436 ఏళ్ల కిందట కులీ కుతుబ్ షాల పాలనా కాలంలో ఇరాన్ ఆర్కిటెక్ట్ హైదరా బాద్ నగరానికి పునాదులు వేశార ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆ నాటి రాజ్యం అవసరాలకు దక్షిణ మూసి అనువైన ప్రాంతంగా గుర్తిం చి 436 సంవత్సరాల క్రితం సుసం పన్నమైన, ప్రపంచ పటంలో స్థానం దక్కించుకున్న హైదరాబాద్ నగరం రూపుదిద్దుకుంది అన్నారు.

ఈ నగర నిర్మాణ సమయంలో కు లీకుతుబ్షా దేవుని ప్రార్థిస్తూ దేవా న దులన్నిటిని చేపలతో నింపినట్టు నా నగరాన్ని జనాభాతో నిం పండి అని ప్రార్థించాడని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కులి కుతు బ్ షా హై దరాబాద్ నగరాన్ని ఎలా నిలబెట్టా రో.. ఫ్యూచర్ సిటీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభు త్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు శంకుస్థాపన చేస్తూ పిలుపునిచ్చిం దన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్ టెక్నాలజీ తో కూడిన అనేక కా ర్యక్రమా లతో ఫ్యూచర్ సిటీ నిర్మా ణం జరుగుతోంది ఆశీర్వదించమని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానంతో అంతా కదిలి వచ్చాం అన్నారు. వారి ఆహ్వానంతో కులీ కుతుబ్ షా నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి అన్నారు.

ఫ్యూచర్ సిటీ దేశానికే కాదు ప్ర పం చానికే తలమానికం కాబోతోంది, ఈ సిటీ ద్వారా ఈ పరిసర ప్రాంత ప్రజ లకు గొప్ప వైద్య, విద్యా సంస్థలు రా బోతున్నాయి అన్నారు. పనుల కో సం దేశ, విదేశాల్లో తిరిగి మంచి శాంతి భద్రతలతో స్థిర నివాసం ఎ క్కడ అంటే ఫ్యూ చర్ సిటీ అని చె ప్పుకునే భూమి పూజ కార్యక్రమం లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉంది అన్నారు. గొప్ప సంకల్ప బ లంతో సీఎం రేవంత్ రెడ్డి నాయక త్వంలోని ప్రజా ప్రభుత్వం మొదలు పెట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణ కా ర్యక్రమం త్వరితగతిన పూర్తి కావా లని ఆ దేవుని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సిటీ నిర్మాణంలో ఈ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనాలని, చరిత్రలో నిలిచిపోయే నగరం దేశానికే కాదు ప్రపంచానికే తలమానికం అన్నారు.

 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లా డుతూదిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా ప్రపంచంలోని ఇతర నగ రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ సంక ల్పమని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రణాళికాబద్ధమైన నగరం అనగానే అందరికీ చంఢీఘర్ గుర్తుకొస్తుంద న్నారు. రాబోయే రోజుల్లో ప్రణా ళి కాబద్ధమైన నగరం అంటే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ గుర్తుకొస్తుందని గుర్తు చేశారు.

 

మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగం యా వత్తు ఆయన మాటల్లోనే..‘లివ్ – లెర్న్ – వర్క్ – ప్లే’ అనే కాన్సెప్ట్ తో పరిశ్రమలు, ఆసుపత్రులు, పాఠశా లలు, షాపింగ్ మాల్స్ అన్ని ఒకే చో ట ఉండేలా అంతర్జా తీయ ప్రమా ణాలతో ఈ నగరాన్ని అభివృద్ధి చే యబోతున్నాం. భావి తరాల కోసం, మన బిడ్డల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజు మనం ద రం కలిసి వేస్తున్న పునాదే ఈ భా రత్ ఫ్యూచర్ సిటీ.ఇది ‘నెట్ జీరో కా mర్బన్ సిటీ’. ఇక్కడ పచ్చదనం ఉంటుంది, కాలుష్యం ఉండదు. పరిశ్రమలు వస్తాయి, కానీ పర్యావ రణానికి ఎలాంటి హాని జరగదు.

రేపటి తరాల కోసం, తెలంగాణ కో సం చిత్తశుద్ధితో నిరంతరం కృషి చే స్తున్న ఈ ప్రజా ప్రభుత్వంతో కలిసి నడవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నా. మమ్మల్ని ఆశీర్వదించాలని కో రుతున్నా. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో పాలు పంచుకుని… రా ష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావా లని ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నా రు.