NalgondaBRS : నల్లగొండజిల్లా బిఆర్ఎస్ ఆద్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులపంపిణీ
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు తెలం గాణకు మరణ శాసనమే --నల్లగొండ రైతులతో కలిసిచలో ఆ ల్మట్టి కార్యక్రమాన్ని చేపడతున్నాం --ఆల్మట్టి వద్ద జరుగుతున్న కుట్రను బహిరంగంగా ఎండగడతాం --సీఎం రేవంత్ రెడ్డికి కమిషన్లు త ప్పితే రైతాంగ సమస్యలపై అవగా హన లేదు --సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
NalgondaBRS: ప్రజా దీవెన, నల్లగొండ: ఆల్మట్టి డ్యా మ్ ఎత్తు పెంపుతో నల్గొండ, రంగా రెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లా లకు మరణ శాసనం రాసినట్లు అ వుతుందని మాజీ మంత్రి, సూర్యా పే ట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆందో ళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణ బేసిన్ లో ఆలస్యంగా నీళ్లు వస్తు న్నాయని, ఆల్మట్టి ఎత్తు పెంచితే ఇక్కడున్న భూములు పడావు ప డాలా అని ప్రశ్నించారు. అధికా రం కోసం హామీలిచ్చి, గద్దెనెక్కిన త ర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కా ర్డులను తిప్పర్తి మండల కేంద్రం లో ఆదివారం ప్రతి ఇంటికి అంద చేసిన అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడారు.
అయినా ఇక్కడున్న అధికార కాం గ్రెస్ పార్టీకి సోయి లేదని, ఇది ద ద్దమ్మ ప్రభుత్వమని ఆగ్రహo వ్యక్తం చేశారు. ఏది పట్టించుకోవట్లే దు, ఆ ల్మట్టి పెంపుగాని జరిగితే ఇక్కడ పొ లాలన్నీ ఎడారిగా మా రాల్సిందే నని, అందుకే బిఆర్ఎస్ పార్టీ తర ఫున నల్గొండ రైతుల తో కలిసి చ లో ఆల్మట్టి కార్యక్రమాన్ని చేపడ తున్నామని , ఆల్మట్టి వద్ద జరుగు తున్న కుట్రను బహిరంగంగా ఎండ గడతామని స్పష్టం చేశారు.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఎం తసేపు కమిషన్లు, పంపకాలు త ప్పితే తెలంగాణ రైతాంగ సమస్యల గురించి అవగాహన లేదు. తె లంగా ణ నీటి హక్కులు సాధించాలన్న సో యి లేదు. నల్గొండ జిల్లా నుంచి ఇ రిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు. ఆ యనకు సోయి లేదు. ఇక కోమటిరె డ్డి వెంకటరెడ్డి కైతే నీళ్ల గురించి ఎ లాంటి అవగాహన లేదని ఎద్దేవా చే శారు. అంగుఆర్భాటాలు తప్పితే ప్రజలు,రైతులు గూర్చి గానీ ఆ య నకి ఏ మాత్రం తెలియదు.ఆయన డమ్మీ మం త్రి. కేసీఆర్ నాయక త్వంలో చలో ఆల్మట్టి కార్యక్రమం చేపట్టి ఆల్మట్టి వద్ద పెంపును అడ్డు కుంటామని స్పష్టం చేశారు.
రాబో యే రెండు, మూడు రోజుల్లోనే ఒక కార్యక్రమాన్ని చేపడతాం. నల్గొండ జిల్లా రైతాంగాన్ని పెద్ద ఎత్తున సమీ కరించి చలో ఆల్మట్టి కార్యక్రమం చే పడతాం. పైన ఉన్నది కర్ణాటక కాం గ్రెస్ ప్రభుత్వమే, కింద ఉన్నది రే వంత్ రెడ్డి గురువు చంద్రబాబు ప్ర భుత్వమే, ఇక్క డున్న రేవంత్ రెడ్డి గురువుకు దక్షిణగా తెలంగాణ నీటి హక్కులను కట్టబెడుతుండు. ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరు కోదని హెచ్చరించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అడ్డగోలుగా ఇచ్చినటువంటి హామీ లను అమలు చేయకుండా పచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ మోసాన్ని ఎం డగడుతూ ఎక్కడికక్కడ బిఆర్ ఎస్ పార్టీ సైన్యం కాంగ్రెస్ బాకీ కార్డు ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ప్రజల నుంచి అద్భుతమైన స్పంద న వస్తుంది. ఎక్కడికెళ్లిన ప్రజలు, రైతులు, వృద్ధులు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తుపోస్తున్నారని విమర్శించా రు. పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పా ర్టీపై తీవ్ర ఆగ్రహంతో వున్నారని స్ప ష్టం చేశారు. సందర్భం ఏదైనా కాం గ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతా మని మాతో చెబుతున్నారని పేర్కొ న్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారం భమైందని ఆరోపించారు. ఈ కా ర్య క్రమంలో నల్ల గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా నాయ కులు తం డు సైదులు గౌడ్, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.