District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అల్టిమేటం, ఎన్నికల ప్రవర్తనా ని యమావళి మేరకు పగడ్బందీ తని ఖీలు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: గ్రామపం చా యతీ, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్ని క ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎ ఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు అప్రమత్తంగా ఉంటూ విధులు ని ర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి కోరారు.బుధవారం ఆ మె ఉద యాదిత్య భవన్ లో ఎన్నిక ల వ్య య నిర్వహణ కమిటీలు, ఎ ఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి బృందాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి బృందాలతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమా ని కి హాజరయ్యారు.
ఎఫ్ ఎస్ టి ఎస్ ఎస్ టి బృందాలు ఎన్నికల సంద ర్భంగా అక్రమంగా డ బ్బులు, మద్యం, బహుమతులు వంటివి పంపిణీ కాకుండా గట్టి ని ఘా ఉంచాలని, ఎక్కడైనా నిబంధ నలకు విరుద్ధంగా నగదు,మద్యం వంటివి తీసుకువెళ్తుంటే తక్షణమే వాటిని సీజ్ చేయడం, సీజ్ చేసిన సామాగ్రి మొత్తాన్ని వీడియోగ్రఫీ చే యించాలని, ప్రతిరోజు ఎఫ్ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు నివేదిక ల ను పంపించాలన్నారు. పట్టుకున్న నగదు, మద్యం తదితర సామాగ్రి అంతటిని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని చెప్పారు.
నగదు వంటివి సీజ్ చేసే సమయం లో అన్ని అంశాలను జాగ్రత్తగా ప రిశీలించాలని, వైద్య పరమైన కార ణా లతో ,వివాహ వేడుకలు,ఇతర వేడుకల సందర్బంగా నగదు తీసు కెళ్లే వారి విషయంలో అన్ని విష యాలు ధ్రువపరచుకొన్న తరువాతే సీజ్ చేయాలని, ఎలాంటి ఆధారా లు లేని నగదు, ఇతర సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లయితే సీజ్ చే యాలని చెప్పారు. ఎవరైనా ఎన్ని కల నిబంధనలు అతిక్రమించి పని చేసినట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎఫ్ఎస్ టి ,ఎస్ ఎస్ టి బృందాలు తప్పనిసరిగా చెక్ లిస్టు కలిగి ఉం డాలని ,అన్ని విషయాలను స మ గ్రంగా వీడియోగ్రఫీ చేయించాలని చెప్పారు.
అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవ ర్తన నియమావళి తప్పకుండా పా టించాలని ,ర్యాలీలు, వాహనాల అ నుమతులు తప్పనిసరిగా చూడాల ని, ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తనా ని యమావళి అమలు చేసే కమిటీలు జాగ్రత్తగా వీటన్నిటిని పరిశీలించాల న్నారు. ఎవరూ ఓటర్లను ప్రభావి తం చేసే ఎలాంటి కార్యక్రమాలు చే యకూడదని, ప్రత్యేకించి డబ్బులు పంపిణీ చేయడం ఎన్నికల నిబంధ నలకు విరుద్ధమన్నారు.
డబ్బు ,మద్యం పంపిణీని అరికట్టేం దుకు ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృం దాలు పూర్తి అప్రమత్తతతో, జాగ్రత్త గా పనిచేయాలని, వీడియోగ్రఫీతో పాటు ,ఎక్కడికక్కడ తనిఖీలు ని ర్వహించాలని అన్నారు .పోలింగ్ ముగిసే రెండు రోజుల ముందు మ రింత అప్రమత్తంగా విధులు నిర్వ ర్తించాలని చెప్పారు. ఎలాంటి ఫి ర్యాదులు రాకుండా విధులు నిర్వ హించాలన్నారు.
దీంతో పాటు పో లింగ్ స్టేషన్ల మా ర్కౌట్, మౌలిక స దుపాయాల కల్ప న, పోలింగ్ రో జు ,ముందు రోజు చేయాల్సిన పనులపై ఎంపీడీవోలు అవగాహన కలిగి ఉండాలని ఆదే శించారు. మిర్యాలగూడ సబ్ కలెక్ట ర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమి త్, జెడ్పి సీఈఓ శ్రీనివాసరావు డిపి ఓ వెంక య్య, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, మాస్టర్ ట్రైనర్ బాలు, ఎఫ్ ఎస్ టి, ఎస్ఎస్ టి బృందా లు, జోనల్ అధికారులు, ఎంపీడీ వోలు, మోడల్ కోడ్ బృందాలు, త దితరులు ఈ సమావేశానికి హాజర య్యారు.