Gandhi Jayanti: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజానీకానికి అత్యంత ప్రీతిపాత్రమైన దసరా ప ర్వదినం మహాత్మ గాంధీనే ఒక వి ధంగా మైమరిపించే విధంగా జరు గుతుండడం సంబ్రమాశ్చర్యాలకు గురిచేయక మానదు. దసరా పండ గ అంటేనే ముక్కా, సుక్కా అనేది నానుడి అయినా గాంధీ జయంతి రోజున అది లేకుంటే ఎలా అనేదిగా తెలంగాణ సమాజంలో గురువారం క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవిక పరి స్థితులు అవుననే నిజాన్ని నిరూపి స్తున్నాయి.
అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఎలా వదులుకునేది అంటున్న కొందరు అభిప్రాయాలు వాస్తవమే అయినా రాష్ట్రంలోనే అతిపెద్ద పండగ దస రా రోజున ముక్క, చుక్క ఎలా బం ద్ చేయడం అనే వాదనకు కూడా బలం లేకపోలేదు.
*గాంధీ జయంతి రోజున దసరా కు దరడం యాదృచ్ఛికమా…*
దేశంలో గాంధీ జయంతి అనేది అక్టోబర్ 2 వ తేదీ అనేది చరిత్రలో చిరస్థాయిలో నిలవడం అందరికీ తెలిసిందే. అయినా గాంధీ జయం తి రోజునే దసరా పర్వదినాన్ని ఫిక్స్ చేసిన సదరు క్యాలెండర్ రూప క ర్త లు, సిద్ధాంతకర్తలు తెలిసే చేశారని అనుమానాలు కూడా లేక పోలేదు. అయినా సరే పొరపాటున గాంధీ జయంతి రోజునే దసరా రావడమ oటే మందు కొట్టకుండా, మటన్ ముట్టకుండా కష్టమే ఎలా వదులు కునేది అంటున్న కొందరు అభిప్రా యాలు కూడా కరెక్ట్ అంటున్నారు మరికొందరు.
ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మాం సం,మందు విక్రయాలు జోరుగా సా గుతుండటo పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయకపోవడం గమనార్హం.
గురువారం గాంధీ జయంతి సం ద ర్భంగా మాంసం, మద్యం సేవించ కూడదని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మటన్, మందు అమ్మకాలు స్వేచ్ఛగా జరుగడం ప రిపాటిగా కొనసాగాయి.
*అంతా కాకతాళీయమేనా…*
దసరా పండుగ సందర్భంగా చెడుపై మంచి గెలిచిన రోజు అని మనం ద రికి తెలిసిందే. అంతర్జాతీయ దినం మహాత్ముడి జయంతి, దసరా పర్వ దినం రెండూ ఈ ఏడాది ఒకేరోజు రావడం కాకతాళీయమే అంశం అ యినా ఆ పర్వదినాల పరమార్థం ఒ క్కటే అన్న గుడార్డం ఒక్కటే. అదే ‘సత్యమేవ జయతే’ ప్రశ్నించే త త్వాన్ని వారసత్వంగా మనకు అం దించారు పూజ్య బాపూజీ, అదే సం దర్భంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కో సం తొమ్మిది రూపాలు దాల్చింది కూడా అంతే సత్యం. కనకదుర్గమ్మ న్యాయాన్ని ధర్మబద్ధంగా సాధించేం దుకు సత్యాగ్రహ మార్గాన్ని గాంధీజీ చూపించారు.
అమ్మలా ప్రేమ పంచడమేకాదు అవ సరమైతే అపరకాళిగానూ మారాల న్నది ఆదిశక్తి అవతారాల సందేశం అనేది నిత్య సత్యం.
*ఆ రెండూ ఉపదేశాలు అంతే స్థాయిలో ఒకే రూపాలు..*
ప్రపంచంలో లోకకంటకులైన అసు రులను అంతమొoదించేందుకు చ రిత్రలో చెప్పిన విధంగా అమ్మవారు తొమ్మిది రూపాలు అవతరించిన విషయం విదితమే. రాక్షసులంటే కొమ్ములు, కోరలతో వికారమైన రూపంలో దర్శనమిస్తా రనుకుంటే పొరపాటే అన్న విష యం కూడా మనందరికి తెలిసిందే.
మనిషిలోని పశుప్రవృత్తి, అ హంకా రం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, మూర్ఖత్వం, కుసంస్కారం వంటి అ వలక్షణాలే రాక్షసత్వానికి ప్రతి రూ పమని కూడా మనందరికి తెలిసిన విషయమే. రాక్షసత్వానికి పా ల్పడి తే శిక్షతప్పదని ఆదిశక్తి అవ తారా లు హెచ్చరిస్తాయి. కామ, క్రోద, లో భ, మోహ, మదమాత్సర్యాలైన అంతర్గత శత్రువులపై ఆధిపత్యం సాధించడానికి సత్య నిష్ఠ ఒ క్కటే ఏకైక మార్గమని మహాత్ముడు బో ధించిన విషయం కూడా మనం దరికి తెలిసిందే.
ఏది ఏమైనా మహాత్మా గాంధీ, తె లంగాణ సమాజంతో పెనవేసుకుని వచ్చినటువంటి గురువారం రోజు సమాజంలోనే ఒక విధమైన సం వా ద చర్చకు దారితీసిందoటే పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయక పోయినా క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చనీ యాంశం గా మిగిలిపోయింది. ఈ విషయం అందరికీ అంతటా తెలిసినప్పటికీ సందర్భోచితంగా *ప్రజాదీవెన* ఈ సందర్భంగా ప్రస్తావిస్తోనడంలో కూ డా ఎలాంటి లోతైన ఆలోచన లేదు.