Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme Court : బిగ్ బ్రేకింగ్, బీసీల రిజర్వేషన్లపై తె లంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్, బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివే సిన సుప్రీంకోర్టు

Supreme Court : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల అమ లుపై తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టులో కేసు విచార ణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందు కు వచ్చారని ఘాటుగా ప్రశ్నించిం ది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టి వేసిన సుప్రీంకోర్టు బీసీ రిజర్వేష న్ల కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ ని విచారించడానికి నిరాకరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి తా త్కాలికంగా స్వల్ప ఊరట లభించి నట్లు అయ్యింది.

తెలంగాణ హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నా యని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీని యర్‌ న్యాయవాదులు తెలిపారు. ఆర్టికల్‌ 32 కింద పిటిషన్‌ ఎందుకు ఫైల్‌ చేశారని పిటిషనర్‌ న్యాయవా దిని జస్టిస్‌ విక్రంనాథ్‌ నేతృత్వంలో ని ధర్మాసనం ప్రశ్నించింది.రాష్ట్ర ప్ర భుత్వం తరపున సీనియర్‌ న్యా యవాదులు సిద్దార్ధదవే, అభిషేక్‌ సింఘ్వీ, ఎడీఎన్‌ రావు హాజర య్యారు. ఈ పిటిషన్‌ని డిస్మిస్ చే సింది సుప్రీంకోర్టు. హైకోర్టులో పిటి షన్లు పెండింగ్‌లో ఉన్నందున, వి చారణకు స్వీకరించలేమని ధర్మా సనం స్పష్టం చేసింది.

ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రి ట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా జో క్యం చేసుకుంటుందని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం ధర్మా స నం. హైకోర్టు స్టే ఇవ్వలేదని అం దు కే సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిష నర్ తరపు న్యాయవాది తెలిపా రు. అయితే స్టే ఇవ్వకపోతే సుప్రీం కోర్టుకు వచ్చేస్తారా అని ప్రశ్నించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ని డిస్మిస్ చేసింది.

ఇదిలా ఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జీవో నెంబర్- 9ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ స్థా నంలో సోమవారం విచారణకు వ చ్చింది. ఈ విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి లు కూడా హాజరయ్యారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వా నికి స్వల్ప ఊరట లభించడం పట్ల,

బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌కు కొట్టివే స్తూ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడం ప ట్ల కాంగ్రెస్ నేతలు స్పందించారు.

*సుప్రీం తీర్పు శుభపరిణామo*

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుశుభ పరిణామమని తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానించారు. 42 శాతం బీసీ రి జర్వేషన్లు ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కొట్టివేయడాన్ని స్వా గతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీ సీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయం లో అన్ని రకాలుగా పోరాటాలు చే సి సాధిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అ మలు చేసేందుకు కృషి చేసిందని తెలిపారు.

8వ తేదీన హైకోర్టులో కూడా ప్రభు త్వానికి అనుకూలంగా తీర్పు వ స్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీ లకు రాజకీయంగా 42 శాతం రిజ ర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గా లు సహకరించాలని మహేష్ గౌడ్ కోరారు.సుప్రీం కోర్టు తీర్పును స్వా గతిస్తున్నామని కాంగ్రెస్ అధికార ప్ర తినిధి డాక్టర్ కొనగాల మహేష్ అ న్నారు. బీసీ బిడ్డలకు కాంగ్రెస్ రిజ ర్వేషన్లు ఇస్తే కొందరు తట్టుకోలేక పోతున్నారని మండిపడ్డారు. బీసీ లకు రిజర్వేషన్ల పెంపు కోసం కాం గ్రెస్ చిత్తశుద్దిగా ఉందన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్‌లు చేస్తున్న కు ట్రలను బీసీలు అర్థం చేసుకోవాలని అన్నా రు. బీసీ బిడ్డల నోటి దగ్గర ముద్దను లాక్కోవద్దని హితవు పలి కారు. బీఆర్ఎస్ నేతలు కుల సం ఘ నాయకుని ముద్ర వేసుకుని కో ర్టుకు వెళ్తున్నారని తెలిపారు. బీసీ ల రిజర్వేషన్ల పెంపును అడ్డుకునే ఉత్సాహాన్ని బీసీలు గమనిస్తు న్నా రని మహేష్ పేర్కొన్నారు.