Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC Reservations : బిగ్ బ్రేకింగ్, బీసీ రిజర్వేషన్ల అంశా న్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తె లంగాణ ప్రభుత్వం, హైకోర్టులో బలమైన వాదనలు

BC Reservations : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్ర తిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగు ణంగా తీవ్ర కసరత్తు ప్రారంబించిం ది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వే షన్ కల్పించే అంశంపై అడుగడుగు నా జాగ్రత్తలు చేపడుతున్న తెలం గాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బల మైన వాదనలతో పై చేయి సాధిం చిన విషయం విదితమే. ఈ క్రమం లో ఉత్సాహంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులోనూ కేసు గెలి చేందుకు తన సర్వశక్తులు ఒద్దు తోంది. అందుకు అవసరమైన కా ర్యాచరణ ప్రణాళికలు సిద్ధం చే స్తోంది.

ఈ నెల 6వ తేదీన సోమవారం సు ప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు వి చారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రు లు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ల బృందం ముందు రోజే ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులు, ఉన్నతాధికా రులతో చర్చించిన విషయం తెలి సిందే.

అయితే రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు కారణంగా బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సోమవారం సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్వి, సిద్ధార్థదవేలు హాజరు కాగా, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తో పాటు మంత్రుల బృందం స్వయం గా సుప్రీంకోర్టుకు వెళ్లి వాదనలు ప్ర త్యక్షంగా పర్యవేక్షించారు.

బీసీ రిజర్వేషన్ ల కేసు ఈనెల 8న బుధవారం విచారణ నేపథ్యంలో స్వయంగా హాజరు కావలసిందిగా న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్వి ని ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డి మంగళ వారం కోరారు.సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు బుధవారం హైకో ర్టులో కేసు విచారణ నేపథ్యంలో స్వయంగా హాజరై వాదనలు విని పించాలని సోమవారం ఢిల్లీలో సీని యర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్వి ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందం ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గం ట గంటకు పరిస్థితిని అంచనా వే స్తూ ముందుకు వెళుతుంది. ఈ క్ర మంలో రేపు హైకోర్టులో బీసీ రిజ ర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, చేప ట్టాల్సిన చర్యలు తదితర అను బం ధ అంశాలను చర్చించేందుకు ఏకైక ఎజెండాతో ఈరోజు సాయంత్రం నా లుగున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యే క సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర కాంగ్రె స్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి న టరాజన్, పిసిసి అధ్యక్షుడు మహే ష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, వా కిటి శ్రీహరి తదితరులు పాల్గొనను న్నారు.