Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, మోగిన ఎన్నికల నగా రా, మొదటి విడత జెడ్పీటీసీ,ఎం పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో స్థానిక సంస్థల ఎన్నికల నగా రా మోగింది. బీసీ రిజర్వేషన్ల అను కూల, వ్యతిరేక వాదనాల మధ్య ఎ ట్టకేలకు ఎన్నికల సంఘం గురు వా రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ల ఎన్నికల నగారా మోగడంతో పల్లె ల్లో రాజకీయ సందడి ప్రారంభం కా నుంది. ఓవైపు తెలంగాణ హైకోర్టు లో బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉన్నప్పటికీ, ఆ అంశంలో కోర్టు తీర్పు ఎలా ఉన్నా తెలంగాణ ప్రభు త్వం ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది.

దీంతో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికా రులు విడుదల చేశారు. గురువా రం నుంచి ఈనెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 31 జి ల్లాల్లో రెండు విడతలుగా ఎంపీటీ సీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగను న్న నేపథ్యంలో మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు శనివారం వరకు నామినే షన్‌లను స్వీక రించనున్నారు.

నామినేషన్‌లు వేసే అభ్యర్థులు కొం త మేర డిపాజిట్ చేయాల్సి ఉం టుంది. జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థి రూ.5000, రిజర్వేషన్ అభ్యర్థి రూ. 2,500 డిపాజిట్ చేయాల్సి ఉండ గా ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డి పాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈనెల 23న పోలింగ్ జరుగనుం డగా నవంబర్ 11న కౌంటింగ్ జర గనుంది. తొలి విడతలో సిద్ధిపేట జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ డివిజన్ పరిధిలోని 15 జె డ్పీటీసీ, 125 ఎంపీటీసీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించ నున్నారు. మండల పరిషత్ కార్యా లయాల్లో జెడ్పీటీసీ నామినేషన్లను స్వీకరించనుండగా ఎంపీటీసీ స్థానా లకు క్లస్టర్ స్థాయిలో నామినేషన్లు స్వీకరించనున్నారు.

అలాగే సంగారెడ్డి జిల్లాలో తొలి విడ తలోజహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్ల లోని 12 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించ నున్నారు అధికారులు. మెదక్ జిల్లా లో మెదక్ డివిజన్ పరిధిలోని 10 జెడ్పీటీసీ, 99 ఎం పీటీసీ స్థానాలకు, నల్లగొండ జిల్లా లో నల్లగొండ, దేవరకొండ డివిజన్ లలో18 మండలా లు, 197 ఎంపీ టీసీ స్థానాలకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5: 00 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. అక్టోబర్ 11 సాయం త్రం 5 గంటల వరకు నామినేషన్ లు స్వీకరించను న్నారు.

ఇదిలా ఉండగా ఎన్నికలపై ఫిర్యా దులు, సూచనల కోసం హెల్ప్ డె స్క్ లను అన్ని MPDO కార్యాల యాల్లో ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 100 మీటర్ల పరిధిలో మా త్రమే ప్రాసెషన్ అనుమతి ఇస్తూ
Model Code of Conduct మా ర్గదర్శకాలను తప్పనిసరిగా పాటిం చాలని రిటర్నింగ్ అధికారులు సూ చిస్తున్నారు. నిబంధనలో ఉల్లంఘి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.