Minister komati Reddy venkata reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, హ్యామ్ విధానంలో తెలం గాణ రాష్ట్ర రోడ్లకు మహర్దశ
Minister komati Reddy venkata reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో హ్యామ్ విధానంలో చే పట్టబోయే రాష్ట్ర ఆర్అండ్ బి రో డ్ల కు మహర్ధశ పట్టనుందని రాష్ట్ర రో డ్లు భవనాల శాఖమంత్రి కోమటి రె డ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ ద్వారా వచ్చే 3సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ అండ్బిబిరోడ్లు అద్దం లా చేయనున్నామని తెలిపారు. గు రువారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రా ష్ట్ర సచివాలయంలో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై ఆర్ అండ్ బి శాఖ మం త్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వ ర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క సమక్షంలో కీలక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా హ్యామ్ రోడ్ల ప్రపోజ ల్స్ కు సంబంధించిన వివరాలను స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు. ఈ సందర్భంగా మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. దేశానికే రోల్ మోడల్ గా నిలపాల నే లక్ష్యంతో ఆర్ అండ్ బి రోడ్ల ని ర్మాణం చేపట్టనున్నామన్నారు.యాక్సిడెంట్స్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై ప్రధాన దృష్టి సారించామని చెప్పా రు.
ఫేజ్ ల వారిగా హ్యామ్ రోడ్లు చేప ట్ట నున్నట్లు మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.మొదటి ఫేజ్ లో సిం హ భాగం హ్యామ్ రోడ్ల నిర్మాణం చే పట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వె ల్లడించారు. అందులో సింగిల్ లే న్,డబుల్ లేన్, 4లేన్ల వారిగా రోడ్ల బలోపేతం చేయనున్నామని, దీం తో పాటు రోడ్ల వైడెనింగ్ చేయను న్నట్లు తెలిపారు. మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు డబుల్ లే న్,జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజ ధానికి 4లేన్ రోడ్ల నిర్మాణం చేయా లని ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.
ఇందులో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నా మన్న మంత్రి,ఒక అసెంబ్లీ నియోజ కవర్గం నుండి ఇంకో అసెంబ్లీ నియో జకవర్గానికి కనెక్టివిటీ కారిడార్లు గా హ్యామ్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలి పారు. మొదటి ఫేజ్ కు ఒకటి,రెం డు నెలల్లో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి వెల్లడించారు.రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కి సహకరిస్తున్న సీఎం రే వంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్కకు ఆర్ అండ్ బి మంత్రి కో మటి రెడ్డి వెంకట్ రెడ్డి వారికి ప్రత్యే క కృతజ్ఞతలు తెలిపారు.
*ట్రాఫిక్ సర్వేను దృష్టిలో పెట్టుకొ ని హ్యామ్ రోడ్లు* రాష్ట్రంలో దశల వారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం త్వ రితగతిన చేపట్టాలని డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క మల్లు అన్నా రు. హ్యామ్ రోడ్ల నిర్మాణ క్రమంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని, రోడ్ల నిర్మాణ క్రమంలో ట్రాఫిక్ సర్వే ను గమనంలో పెట్టుకోవాలని డి ప్యూటీ సీఎం తెలిపారు.ఈ సమా వేశంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్ర టరీ వికాస్ రాజ్,ఫైనాన్స్ సెక్రటరీ హరిత,ఆర్ అండ్ అధికారులు జయ భారతి,బి.వి రావు,పలు వు రు ఆర్ అండ్ బి ఇంజనీర్లు తదిత రులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా అంతకు ముందు మంత్రి తన ఛాంబర్ లో ఆర్ అండ్ బి ఉన్నతాధికారులతో శాఖపై సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఫ్లడ్ డ్యామేజీ రోడ్ల వివరాలపై ఆరా తీ శారు. పూర్తి వివరాలు త్వరలో స మర్పించాలని అధికారులను ఆదే శించారు. మంచి రోడ్లు రాష్ట్ర అభి వృద్ధికి సోపానాలు అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.