Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన, తెలంగాణలో నిర్మాణ రంగ వృద్ధి రేటు 11.97 శాతం 

Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ‘2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చే సిందని, 11.97 శాతం వృద్ధి రేటు తో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్య వస్థకు రూ.80వేల కోట్లకు పైగా స మకూర్చిందని స్టేట్ సర్వీసెస్ జీఎస్ డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలెప్ మెంట్ కౌన్సిల్(నారెడ్కో) తెలంగా ణ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్ లో ని ర్వహిస్తున్న 15వ నారెడ్కో తెలం గాణ ప్రాపర్టీ షోలో ఆయన ఆదివా రం పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో 2 024 సెప్టెంబర్ లో రూ.2820 కోట్ల విలువైన 4903 ఇళ్ల రిజిస్ట్రేషన్ జ రిగిందని, ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.4804 కోట్ల విలువైన 6612 ఇ ళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇది 35 శాతం అధికం. విలువలో వార్షిక వృద్ధి 70 శాతంగా నమోదయ్యింద న్నారు. ఇవి కేవలం గణాంకాలు కా దని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదే లయ్యిందంటూ మాపై దుష్ర్పచారం చేస్తున్న వారికి ధీటైన సమాధానాల ని ఈ సందర్భంగా ఆయన పేర్కొ న్నారు.

‘ఈ సెప్టెంబర్ లో రూ.కోటి పైన వి లువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 151 శాతం పెరుగుదల ఉంది. మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వా టానే 53 శాతం’ అని చెప్పారు. ‘భా రత్ లో వ్యవసాయం తర్వాత ఎ క్కువ మంది రియల్ ఎస్టేట్ రంగం లోనే ఉపాధి పొందుతున్నారు. అ యితే అభివృద్ధి చెందిన దేశాల జీ డీపీలో స్థిరాస్తి రంగ వాటా సగటున 10 శాతం 15 శాతం కాగా చైనాలో అత్యధికంగా 23 శాతం నుంచి 25 శాతం వరకుంది. మన దేశంలో ఇది 6 శాతం నుంచి 8 శాతమే కాగా ఇ ది మరింత పెరగాల్సిన అవసర ముందని అభిప్రాయపడ్డారు.

‘ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో ఫేజ్ –2, భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు తదితర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో తె లంగాణ రూపురేఖలు మారిపో ను న్నాయి. డిసెంబర్ నాటికి ‘ఫ్యూచర్ సిటీ’లో జోనలైజేషన్ ప్రక్రియను ప ట్టలెక్కించాలనే పట్టుదలతో ఉ న్నా మన్నారు. అక్కడే 200 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అభి వృద్ధి చేయనున్న ఏఐ సిటీకి రెండు, మూడు నెలల్లోనే భూమి పూజ చే యబోతున్నామని వివరించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెము క గా నిలుస్తున్న రియల్ ఎస్టేట్ రంగా నికి ప్రభుత్వం తరఫున అన్ని వి ధా లుగా అండగా ఉంటామని హామీ ఇ చ్చారు. ఈ కార్యక్రమంలో నారెడ్కో తెలం గాణ ప్రతి నిధులు విజయసా యి మేక, కాళీ ప్రసాద్ దామెర, డా. లయన్ కిరణ్, కె.శ్రీధర్ రెడ్డి, ఆర్. వెంకటేశ్వరరావు తదితరులు పా ల్గొన్నారు.