Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi : ప్రత్యేక అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలి

–ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

–కేజీబీవీలు, మోడల్ పాఠశాలల ను తనిఖీ చేయాలి

–సిపిఆర్ పై అవగాహన శిబిరాల ను నిర్వహించాలి

–సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆదేశం

District Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మండల ప్రత్యేక అధికా రులు మండలాలలో చేపట్టిన అ భివృద్ధి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంకా ప్రారం భించని ధాన్యం కొనుగోలు కేంద్రాల న్నింటినీ వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రా లలో అన్ని సౌకర్యాలు ఉండాలని, ముఖ్యంగా అకాల వర్షానికి దాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్య లు చేపట్టాలని కోరారు. సోమవా రం ప్రజావాణి కార్యక్రమంలో భాగం గా కలెక్టర్ కార్యాలయంలోని సమా వేశ మందిరంలో ప్రజావాణి సంద ర్భంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదు లను స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా అధికారులతో పలు అంశాల పై సమీక్షించారు.

ప్రత్యేక అధికారులు అన్ని కేజీబీవీ లు, మోడల్ పాఠశాలలను తనిఖీ చేయాలని, అలాగే మండల స్థాయి లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాల పనులను సైతం పర్యవే క్షించాలని చెప్పారు. పూర్వ ప్రాథ మిక విద్యకు సంబంధించి నమోదు ను పెంచాలని డీఈవో బిక్షపతిని ఆ దేశించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ని ర్మిస్తున్న వికలాంగుల ధ్రువపత్రం జా రీ కేంద్రం పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయా లని డిఆర్డిఓ శేఖర్ రెడ్డిని ఆదేశిం చారు. ఇటీవల కాలంలో గుండె జ బ్బులతో అనేకమంది మరణిస్తు న్నారని, ఇందుకు గాను వైద్య ఆ రోగ్యశాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా సిపిఆర్ పై అవగాహన శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ను ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సిపి ఆర్ పై అవగాహన కై ఈ నెల 13 నుండి 17 వరకు శిక్షణ కార్యక్రమా లను నిర్వహించడం జరుగుతు న్న దని, ఆయా శాఖల ద్వారా అవసర మైన వారి పేర్లను పంపిస్తే శిక్షణ ఇ వ్వడం జరుగుతుందని తెలిపారు. సిపిఆర్ ప్రాధాన్యత, గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ ద్వారా ప్రథ మ చికిత్స అందించే అంశంపై రూ పొందించిన ప్రతిజ్ఞను సమావేశానికి హాజరైన వారందరితో చేయించా రు.

ఈ నెల 24 లోగా జిల్లాలో వి విధ శాఖలలో ఖాళీగా ఉన్న పో స్టు ల వివరాలు పంపించాలని అదన పు కలెక్టర్ జె.శ్రీనివాస్ జిల్లా అధికా రు లను కోరారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, ఇన్చా ర్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, గృహ ని ర్మాణ పిడి రాజ్ కుమార్, దేవరకొం డ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా అధికా రులు ఉన్నారు. కాగా ఈ సోమవా రం 90 మంది వారి సమస్యల పరి ష్కారానికి దరఖాస్తులను సమర్పిం చగా, అందులో 45 రెవెన్యూ శాఖ కు సంబంధించి రాగా, మరో 45 వి విధ శాఖలకు వచ్చాయి.