APJ Abdul Kalam : ప్రజా దీవెన, దేవరకద్ర: భారత ర త్న డాక్టర్ ఎ పి జె అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయ మని జూనియర్ రెడ్ క్రాస్ సమ న్వయ కర్త లయన్ అశ్విని చంద్రశే ఖర్ అన్నారు. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం పురస్కరించుకొని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దివంగత మాజీ రాష్ట్రపతి భారతర త్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు బుధవారం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవర ణలో జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్ర పటానికి హెచ్ యం లు, ఉపా ధ్యాయులు, విద్యార్థులు పూలమా ల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చం ద్రశేఖర్ మాట్లాడుతూ ప్రపంచం గ ర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అ బ్దుల్ కలాం అని కొనియాడారు. ఆ యన జీవన విధానం వారి దార్శ నికత ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదా య కమన్నారు. విద్యార్థులు ఏపీజే అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శం గా, మార్గదర్శకంగా తీసుకొని ముం దుకు సాగాలని పిలుపు నిచ్చారు. విద్యార్థులు చదువులో ఒక లక్ష్యా న్ని మార్గం చేసుకొని బంగారు భవి ష్యత్తుకు ఎదగాలన్నారు.
నీతి, నిజాయితీ, నిరాడంబరత, దేశభక్తి కి అబ్దుల్ కలాం నిలువెత్తు నిదర్శన మని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక , ఉన్నత పాఠశాలల హెచ్ యం లు ఎస్.కల్పన, ఆశ్ర ఖాద్రి, ఉపాధ్యాయులు దోమ శంకర్, కమల్ రాజ్, నాగేశ్వర్ రెడ్డి , మదన్ మోహన్, బి.విజయ లక్ష్మీ, కె. సు జాత, వెంకట్రాములు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.