Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

శ్రీగంధం అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

— ముగ్గురు నిధితుల అరెస్ట్ చేసిన నల్లగొండ పోలీసులు

Sandalwood Thieves : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లాతో పాటు సికింద్రాబాద్ పరిసరాల్లో రైతులు పెంచుకున్న శ్రీ గంధం చెట్లను నరికి షాగను విక్ర యిస్తున్న నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురి ని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని బుధవారం డీఎస్పీ కే.శివరాంరెడ్డి విలేకర్ల సమావేశంలో వెల్లడించా రు. సెప్టెంబరు 30వ తేదీన నల్లగొం డ జిల్లా కనగల్ మండలంలో రైతు విద్యాసాగర్రెడ్డికి చెందిన తోటలోని 10 శ్రీగంధం చెట్ల షాగలను దొంగత నం చేయడంతో పాటు మరో 5 శ్రీ గంధం చెట్లను నరికి వదిలివేశారు. ఈ ఘటనపై విద్యాసాగర్రెడ్డి కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కే సు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

నల్లగొండ జిల్లా ఎ స్పీ శరత్ చంద్రపవార్ ఆదేశాల మే రకు నాలుగు బృందా లుగా ఏర్పడి బుధవారం నల్లగొండ- దేవరకొండ రహదారిపై రంగారెడ్డి బంగ్లా వద్ద వాహనాలను తనిఖీ నిర్వహిస్తుం డగా దేవరకొండ వైపు నుంచి నల్ల గొండకు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న ముగ్గురు అనుమానాస్ప దంగా కనిపించగా వెంబడించి తని ఖీ చేశారు. వారి వద్ద మూడు రం పాలు, మూడు గొడ్డళ్లు, పెన్సింగ్ వై ర్ కట్ చేసే ఒక కట్టర్, ఒక యాక్సల్ బ్లేడ్, మూడు మొబైల్ ఫోన్లను, రెం డు బైకులను స్వాధీనం చేసు కొని అదుపులోకి తీసుకొని విచారించా రు.శ్రీగంధం చెట్లను మొత్తం ఆరుగు రు అంతర్రాష్ట్ర నిందితులు అక్రమం గా నరికి దొంగతనం చేస్తున్నట్లు పో లీసులు గుర్తించారు.

ఇందులో మ హారాష్ట్రకు చెందిన అన్నా లక్ష్మణ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జ వాస్, అదే రాష్ట్రానికి చెందిన అజు వా పరారీలో ఉండగా మధ్యప్రదేశ్ కు చెందిన దీవానా, దద్దసింగ్, మ జాన్లను పోలీసులు అరెస్టు చేసి రి మాండ్ కు తరలించారు. వీరు దే శంలోని వివిధ ప్రాంతాలల్లో సం చా ర జీవితాన్ని గడుపుతూ రుద్రాక్షలు, పూసలు విక్రయిస్తూ జీవనం సాగి స్తున్నారు. వీరు ఎక్క డికి వెళ్లినా గ్రామశివారులో గుడారాలు వేసుకొ ని నివసిస్తూ ఉంటారు.రెండునెలల కిందట మహారాష్ట్రకు చెందిన అ న్నాభౌ లక్ష్మణ్ గైక్వాడ్ మిగతా ఐ దుగురికి పరిచమయ్యాడు. వీరం తా హైదరాబాద్ లో ఉన్నప్పుడు ల క్ష్మణ్ గైక్వాడ్ వీరి గుడిసెల వద్దకు వచ్చేవాడు.

రుద్రాక్షలు విక్రయించి ఎన్నాళ్లయినా ధనవంతులు కాలే రని, తాను చెప్పినట్లుగా చేస్తే అధి కంగా డబ్బు సంపాదించవచ్చని రెచ్చగొట్టేసేవాడు. తెలంగాణలో రై తులు గంధం చెట్లను అధికంగా సా గు చేస్తుంటారని, ఆ గంధం కర్రలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నం దున వాటిని నరికి విక్రయిస్తే వచ్చి న డబ్బులో వాటా ఇస్తానని ఒప్పిం చాడు. దీంతో వారంతా కలిసి శ్రీగం ధం చెట్లను నరికి దొంగతనాలు చేసే వారన్నారు. అధిక డబ్బు సంపాదిం చాలనే దురాశతో దొంగతనాలకు ఒ ప్పుకొని కనగల్ మండలంలోని తేల కంటిగూడెం, తిమ్మన్నగూడెం, నార్కట్ పల్లి, గుర్రంపోడు, నల్లగొం డ రూరల్, చండూరు మండలాల్లో మొత్తం ఆరు దొంగతనాలు చేశార న్నారు. వివిధ ప్రాంతాలల్లో 166శ్రీ గంధం చెట్లను నరికారని దీంతో రూ.1.66 కోట్ల విలువైన ఆర్థికనష్టం జరిగిందని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్ష ణలో కేసును త్వరితగ తిన ఛేదించిన చండూరు సీఐ కే. ఆదిరెడ్డి, ఎస్ ఐలు కే.రాజీవ్ , ఎన్.వెంకన్న, బీ. సైదాబాబులతో పాటు రైటర్ ర మేష్, జానకి రాములు, తిరుమల్లే ష్, శ్రీకాంత్, రాజు, బాలకోటి, శం కర్, శేఖర్, సురేష్, రమేష్, వెంక ట్ రెడ్డి లను ఎస్పీ శరత్ చంద్రపవార్ అభినందించారు.