త్వరలో మార్కట్లోకి ఇథనాల్ వాహనాలు
ప్రజా దీవెన/నాగ్ పూర్: ఇథనాల్ తో నడిచే సరికొత్త వాహనాలను భారత్ లో త్వరలో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైనట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్గరి ప్రకటించారు. నాగపూర్ లో ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే తయారు చేస్తామని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ చైర్మన్ తనతో చెప్పారని, అదేవిధంగా టయోటా కంపెనీకి చెందిన క్యామీ కారు ను ఆగస్టులో విడుదల చేస్తామని కూడా చెప్పారు. ఈ కారు 100 శాతం ఇథనాల్ తో నడుస్తుందని అంతేకాక 40 శాతం విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తుందన్నారు.
ఇథనాల్ ధర లీటర్ కు 40 రూపాయలు మాత్రమే కాగా ఈ వాహనం 40% విద్యుత్తు కూడా ఉత్పత్తి చేస్తున్నందుకు వాహనానికి లీటర్ కు రూ. 15 మాత్రమే ఖర్చు అవుతుందని మంత్రి వెల్లడించారు. కాగా ఇథనాల్ తో నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తే త్వరలోనే పెట్రోల్ వాహనాల వాడకానికి పుల్ స్టాప్ పడే పరిస్థితి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.