Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC Reservations : బిగ్ బ్రేకింగ్,బీసీ రిజర్వేషన్లపై ప్రభు త్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

BC Reservations : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీవో 9పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వా నికి చుక్కెదురైంది. గురువారం వి చారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్ర భుత్వం తరపున దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను తోసిపుచ్చింది. తె లంగాణ హైకోర్టు లోనే తేల్చివా లం టూ స్పష్టం చేస్తూ తీర్పు వెలువరిం చింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రి జర్వేషన్లు (BC Reservations) క ల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసి న జీవో నంబర్ 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం గురువారం విచారణ జరిపి ఈ మేరకు అభిప్రా యపడ్డారు.

హైకోర్టుస్టే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయిన నేపథ్యం లో 9 జీవో ఆధారంగా ఎన్నికలు ని ర్వహించేందుకు అనుమతి ఇ వ్వా లని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కో ర్టును ఆశ్రయించిoది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచిన తీర్పు కీలకంగా మారింది.

బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తు ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్న సందర్భంలో తాజా సుప్రీం కోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వే ష న్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ ప్రారంభం కా గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభి షేక్ సింఘ్వీ వాదనలు వినిపించా రు.

ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసు కోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదని కోర్టుకు వి వరించే ప్రయత్నం చేశారు. ఇందిరా సహానీ కేసులోనూ 50శాతం పరమి తి దాటొచ్చని ఉందని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తె లంగాణలో కులగణన సర్వే జరిగిం దన్నారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్కతేల్చిందని అభిషేక్ సిం ఘ్వీ న్యాయస్థానానికి వివరించా రు.

రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అ న్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చే శాయని, 3 నెలలు దాటినా బి ల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేద ని వాదించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొం దినట్టేనని సుప్రీం చెప్పిందని,సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారి నట్టేనని వాదనలు బలంగా వినిపిం చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చే సిన పిటిషన్‌పై విచార ణ చేపట్టిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టి స్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం గురువారం పిటిషన్ ను డిస్మిస్ చే సింది. ఆ తర్వాత తెలంగాణ హై కోర్టులోనే తేల్చుకోవాలని అవ సర మైతే పాత రిజర్వేషన్లు ప్రకారం ఎ న్నికలు నిర్వహించుకోవచ్చుని సు ప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది.