Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, రైతుల ఖాతాల్లో 72 గంట ల్లో ధాన్యం డబ్బులుజమ
–రైతులు విధిగా సన్నధాన్యాన్ని పండించాలి
–అత్యధిక ధాన్యం పండించే జిల్లాల్లో నల్లగొండ రెండవది
–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkata Reddy :
ప్రజా దీవెన, తిప్పర్తి: ధాన్యం అమ్మి న రైతుల ఖాతాలలో ధాన్యం డ బ్బులను 72 గంటలు జమ చేస్తా మని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవా రం అయన నల్గొండ జిల్లా ,తిప్పర్తి మండలం, కంకణాలపల్లి, అంతా య గూడెం, మామిడాలపల్లి గ్రామా లలో ఐకెపి ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించారు. అంతేగాక కంకణాల పల్లి లో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తిప్పర్తి మండల కేంద్రంలో దాన్యాన్ని తర లించే లారీలను జండా ఊపి ప్రారం భించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆయా ధా న్యం కొనుగోలు కేంద్రాల వద్ద మా ట్లాడుతూ రైతుల కళ్ళల్లో సంతో షాన్ని చూడడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అందుకే ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రా ధాన్యత ఇస్తున్నదని, ఇందులో భా గంగా ఈ సంవత్సరం ఖరీఫ్ ధా న్యం అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించేందుకుగాను 25వేల కోట్ల రూపాయలను క్యాబినెట్ కేటా యించినట్లు వెల్లడించారు. రైతులు ధాన్యం అమ్మిన డబ్బుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని, 72 గంటల్లో వారి ఖాతాలలో జమ చేస్తామని, ఒకవేళ డబ్బులు జమ కాకుంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చు అని తెలిపారు.
రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా అత్య ధి కంగా ధాన్యం పండించే రెండవ జి ల్లాగా నిలిచిందని, అయితే రైతులు సన్న ధాన్యాన్ని ఎక్కువగా పండిం చాలని, ఈ దిశగా అధికారులు ప్రో త్సహించాలని సూచించారు. ధన వంతుల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభు త్వం పెడలందరికి రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం అందిస్తు న్న దని, అందువల్ల సన్నబియాని ఎ క్కువగా పండించాలన్నారు. నిజా మాబాద్ జిల్లాలో 75% సన్న బి య్యం పండిస్తున్నారని, అందువల్ల నల్గొండ జిల్లాలో సైతం సన్నబి య్యనికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కో సం అనేక పథకాలను ప్రవేశపెట్టిం దని, ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ ద్వారా 6600 కోట్ల రూపా యలతో రోడ్ల నిర్మాణం చేపట్టా మ ని,4500 కోట్ల రూపాయలకు ఇటీ వలే క్యాబినెట్ అనుమతి తీసుకు న్నామని త్వరలోనే టెండర్లు పిలిచి జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మం డల కేంద్రాల నుండి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు,గ్రామాల నుండి మం డలాలకు సింగిల్ రహదారి సౌక ర్యాన్ని కల్పిస్తున్నామని, ఇందుకు క్యాబినేట్ కూడ అనుమతించడం జరిగిందని ఆయన వెల్లడించారు. రహదారి, రవాణా సౌకర్యం బాగు న్నప్పుడే రైతులు పండించిన ఉత్ప త్తులను మార్కెట్ కు తీసుకు వె ళ్ళేందుకు వీలు కలుగుతుందని ఆ యన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 7 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామ ని ,గత ప్రభుత్వం 10 సంవత్సరా లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వ లేదని అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో దాన్యం లారీలకు జండా ఊపి ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం మిల్లులు తరలించడం, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని,ఇందుకుగాను ట్రాన్స్పోర్ట్ యజమానులు, లారీల యజమానులు సహకరించాలని, నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా తరలి ంచాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డారు.అదనపు కలెక్టర్ జె .శ్రీనివా స్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి , డి ఎస్ ఓ వెంకటేష్,పౌర సరఫరాల డి ఎం గోపికృష్ణ ,డి సి ఓ పత్యానా యక్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, పాశం రాంరెడ్డి, ఇతర ప్రజాప్రతిని ధు లు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.