–ముక్తకంఠంతో ఖండించిన జర్న లి స్ట్ సంఘాల నేతలు
–అక్రమ కేసులను ఖండిస్తూ జర్న లిస్ట్ ల ర్యాలీ, నిరసన
Against Sakshi Media : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వలోని అవి నీతి అక్రమాలను వెలికి తీస్తూ ప్రజ ల పక్షాన నిలుస్తున్న ‘సాక్షి’ మీడి యాపై దాడులు. కక్షసాధింపు చ ర్యలు వెంటనే ఆపాలని జర్నలిస్ట్ సంఘాల నాయకులు ముక్త కంఠం తో డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ సం ఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నల్ల గొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో జర్నలిస్ట్ లు ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ నిరస న, ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృ ష్ణా రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్ర భుత్వం నిజాలను నిర్భయంగా రా సే సాక్షి మీడియాపై. జర్నలిస్ట్‌లపై పె ట్టిన అక్రమ కేసులను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చే శారు. కేసులు ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తు న ఆందోళన చేస్తామని హెచ్చ రించారు. టీయూడబ్ల్యూజే (143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిజాలు రాసే సాక్షి మీడి యాను అణగదొక్కాలని చూస్తూ అ క్రమ కేసులు పెడుతే సహించబోమ న్నారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని, లేకుంటే అన్ని జర్నలిస్ట్ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చ రించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు యెరెడ్ల చంద్రశేఖర్‌రెడ్డి, వం గాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం మీడి యా స్వేచ్ఛను హరించే విధంగా, న చ్చని మీడియా పై అక్రమ కేసులు పెడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నకిలీ మద్యం కేసులో నిజాలను వెలికితీయకుండా సాక్షి మీడియా పై కేసులు పెడితే జర్న లిస్ట్ సమాజం ఊరుకోదని హెచ్చ రించారు.
ఈ కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇం చార్జి చింతకింది గణేష్, సాక్షి టీవీ ప్రతినిధి పాశం అశోక్ రె డ్డి, నమస్తే తెలంగాణ బ్యూరో ఇంచార్జి మర్రి మహేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు అశ్వాక్, మీసాల శ్రీనివాస్, మ నం స్టాఫర్ సయ్యద్, జీ తెలుగు ప్ర తినిధి సల్వాది జానయ్య, జర్నలిస్ట్ లు లింగయ్యగౌడ్, కృష్ణ. దశరథ, రాంప్రసాద్, ఐబీసీ గిరి, మధు, వి నోద్, సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది భజరంగ్ ప్రసాద్, కెమెరామెన్ బత్తుల శ్రీనివాస్ గౌడ్, ఫోటో జర్న లిస్ట్ లు, కంది శ్రీనివాసప్రసాద్, ఆ కాశ్, వెంకన్న, ఏడీవీటీ సిబ్బంది వెంకట్ రెడ్డి, జానకిరాములు తది తరులు పాల్గొన్నారు.