CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆ ధ్వర్యంలో అత్యంత వైభవంగా జరి గిన సదర్ కార్యక్రమంలో ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నా రు. తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తు న్నారని, వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పి స్తామని ఈ సందర్భంగా ముఖ్య మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఇందిరా పార్క్ – ఎన్టీ ఆర్ స్టేడియంలో యాదవ సోదరు లు శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన సదర్ కార్యక్ర మంలో ముఖ్యమంత్రి ప్రసంగిం చా రు. నమ్మిన వారికోసం ఎంత కష్ట మొచ్చినా, నష్టమొచ్చినా యాద వులు అండగా నిలబడుతారని, వారి అండతోనే హైదరాబాద్ ప్ర పం చ పెట్టుబడులకు ఆదర్శ నగరంగా మారిందని ప్రశంసించారు.
యాదవ సోదరుల ఖదర్ హైదరా బాద్ సదర్ అని, ఎంతో చరిత్ర కలి గిన సదర్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరి నప్పుడు వెంటనే ఆమోదించడమే కాకుండా నిధులు కేటాయించామని గుర్తుచేశారు. యాదవుల సహకా రంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముం దుకు తీసుకెళతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొ న్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు సదర్ సమ్మేళన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.