DGP Shivadhar Reddy : బిగ్ బ్రేకింగ్, డిజిపి శివధర్ రెడ్డి కీల క వ్యాఖ్య,ఎలాంటి తీవ్రనేరస్తులైనా కఠినంగా అణచివేస్తాo
DGP Shivadhar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో లాఅండ్ ఆర్డర్‌ను పూర్తి స్థా యిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.కరడుగట్టిన నేర స్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్‌కు పోలీసు శాఖ తరుపున ఆయన ఘన నివా ళులు అర్పించారు. సోమవారం మీ డియాతో మాట్లాడుతూ భర్త ప్ర మోద్‌ను పోగొట్టుకున్న అతని భా ర్య ప్రణీతకు, అతి చిన్న వయసు లోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కు టుంబానికి ప్రభుత్వం, పోలీసు శా ఖ పూర్తి స్థాయిలో అండగా ఉం టా యని హామీ ఇచ్చారు.
కానిస్టేబుల్ కుటుంబానికి జీవో ఆర్టీ నెంబర్ 411 ప్రకారం ఒక కోటి రూ పాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వను న్నట్లు ప్రకటించారు. కానిస్టేబుల్ ప దవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబసభ్యుల లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా మన్నారు. జీవో 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చే స్తామన్నారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రే షియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 ల క్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. విధినిర్వహణలో ప్రా ణాలు కోల్పోయిన వారికి తెలంగా ణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున డీ జీపీ శివధర్ రెడ్డి నివాళులర్పించా రు.
*రియాజ్ ఆటకట్టు….* రాష్ట్రం లో సంచలన సంఘటనగా మారిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పురోగతి లభించింది. నిందితుడు షేక్ రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రెండు రోజుల క్రి తం నిజామాబాద్ పట్టణంలో కాని స్టేబుల్ ను హత్య చేసిన అతడు పారిపోగా పోలీసులు కేసును చా లెంజ్ తీసుకున్నారు. అనంతరం రి యాజ్ ను పట్టుకునేందుకు బృందా లుగా ఏర్పడి గాలింపు చర్యలు చే పట్టారు. ఈ క్రమంలోనే నిన్న మ ధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాం తంలో రియాజ్ ను పట్టుకునేందు కు ఓ యువకుడు ప్రయత్నించగా ఘర్షణ కూడా చోటు చేసుకుంది.
ఆ క్రమంలో అక్కడికి చేరుకున్న పో లీసులు అతడిని అదుపులోకి తీ సుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న నేప థ్యంలో సోమవారం ఆస్పత్రిలో రి యాజ్ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గ న్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అ నంతరం అక్కడి నుంచి పారిపో యేందుకు యత్నించడంతో అప్రమ త్తమైన పోలీసులు కాల్పులు జరప డంతో అక్కడికక్కడే మృతిచెంది నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా రియాజ్ మృతి ఆ స్పత్రి వైద్యులు నిర్ధారించారు. కాగా నిందితుడిపై 40 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ హత్య కే సు నిందితుడు రియాజ్ మృతదేహా నికి పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి కాగా నే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం మార్చురీకి తరలించారు. ఇ వ్వాళ అనగా మంగళవారం ఉద యం పోస్టుమార్టం నిర్వహించి ను న్నట్లు తెలుస్తోంది.
*సీన్ రీకన్‌స్ట్రక్షన్….* ఎన్‌కౌం టర్ పై నిజామాబాద్ ప్రభుత్వ ఆ సుపత్రిలోని ఫోర్త్ ఫ్లోర్‌లో సీన్ రీక న్‌స్ట్రక్షన్ జరిగింది. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో పా ల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, జ్యుడీ షియ ల్ ఎంక్వైరీ తర్వాత రియాజ్ మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్ప గించనున్నారు.
తాజా పరిస్థితులపై సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ ఆస్పత్రిలో ఉన్న రియాజ్ ఉదయం ఆర్‌ఐ తు పాకీ లాక్కున్నాడని, ఈ నేపథ్యం లోనే ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారన్నారు. రియాజ్ మృతదే హానికి పోస్టుమార్టం పూర్తి చేశామ ని ,రియాజ్ దాడిలో గాయపడ్డ ఆ సీఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉం దని తెలిపారు.