President Droupadi Murmu : బిగ్ బ్రేకింగ్, రాష్ట్రపతి ద్రౌపది ము ర్ముకు తప్పిన ప్రమాదం, నిలక్కల్ లో కాంక్రీట్ హెలిప్యాడ్‌లో చిక్కుకు న్న హెలికాప్టర్ చక్రం
President Droupadi Murmu : ప్రజా దీవెన, తిరువనంతపురం: రా ష్ట్రపతి ద్రౌపది ముర్ము తృటిలో పె ను ప్రమాదం నుంచి బయట పడిం ది. తిరువనంతపురం నుంచి నిల క్కల్ వరకు హెలికాప్టర్‌లో ప్రయా ణించిన రాష్ట్రపతి, నిలక్కల్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో అనూహ్య పరిస్థితి నెలకొంది. కొత్త గా వేసిన కాంక్రీట్ హెలిప్యాడ్‌లో హె లికాప్టర్ చక్రం చిక్కుకోవడంతో ఆం దోళన చోటుచేసుకుంది.
భద్రతా సిబ్బంది తక్షణ చర్యతో హె లికాప్టర్‌ను సురక్షితంగా నిలిపి రా ష్ట్రపతిని దిగేలా చేశారు. అనం తరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలక్కల్ నుంచి పంబకు బయల్దేరి, పంబలోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదనంతరం తరువాత ప్రత్యేక వా హనంలో శబరిమలకు చేరుకున్న రాష్ట్రపతి, అక్కడ స్వామి అయ్య ప్పను దర్శించుకున్నారు. ఈ ఘట నలో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడం వల్ల అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Big Breking, president Droupadi Murmu narrowly escaped an heli copter accident pic.twitter.com/p0vUY1ggSQ
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) October 22, 2025