–ఆసుపత్రి నిర్మాణంతో దశాబ్దాల ప్రజల కలనెరవేరేదెన్నడో
–రెండేళ్లు కావస్తున్నా అసంపూర్తిగా నే ఆసుపత్రి పనులు
Tungaturthi Hospital : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగ తు ర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్మా ణ మవుతున్న వంద పడకల ఆస్పత్రి పనులు గత రెండు సంవత్సరాలు గా నత్తనడకగా కొనసాగుతున్నా యి. నిర్మాణం చేపట్టి రెండు సంవ త్సరాలు పైగా అవుతున్న నిర్మాణ పనులు మూడు అడుగులు ముం దుకు ఆరడుగులు వెనుకకు అన్న చందంగా ఉంది.
దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న 100 పడ కల ఆసుపత్రి కల నెరవేరేది ఎన్న డూ అని ప్రజలు అనుకుంటున్నా రు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో తుంగతుర్తి లో ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చుతూ అప్పటి ప్ర భుత్వం జీవో తో పాటు నిధులను విడుదల చేసింది. దీంతో అప్పటి ప్ర భుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈలోపు ప్ర భుత్వ మారడంతో ప్రస్తుత శాసనస భ్యులు మందుల సామేలు మరొక సారి వంద పడకల ఆసుపత్రికి శం కుస్థాపన భూమి పూజ చేశారు.
ఈ ఆస్పత్రికి 44.95 కోట్లు పైగా ని ధులు మంజూరైనట్లు జీవో కూడా విడుదలైంది. గుత్తేదారు ఆసుపత్రి నిర్మాణ పనులను చేపట్టారు. నిధు ల కొరత కారణము లేక మరేదైనా కారణం తెలియదుగానీ ఆసుపత్రి నిర్మాణ పనులు మాత్రం గత కొద్ది నెలలుగా ఆగిపోయాయి. గత మూ డు నెలల నుండి గుత్తేదారు ఆస్పత్రి భవన నిర్మాణ పనులు చేపట్టకపో వడంతో పూర్తిగా నిలిచిపోయింది.
దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న వంద ప డకల ఆసుపత్రి పనులు ఊపందు కోకపోవడంతో నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందా అని ప్రజలు ఆశ తో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో 60 నుండి 70 మం ది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కౌ న్సిలింగ్ లో తుంగతుర్తి ప్రభుత్వ ఆ సుపత్రికి వివిధ రకాల స్పెషలిస్ట్ డా క్టర్లు కూడా వస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆస్పత్రి ఎలాంటి ఆపరేష న్లు జరగక కేవలం ఓపికి మాత్రమే పరిమితమైంది.
*పెరుగనున్న వైద్య సేవలు.* .. వంద పడకల ఆసుపత్రి భవాని ని ర్మాణాలు పూర్తయితే అన్ని రకాల అత్యవసర వైద్య సేవలు ఆసు పత్రి లో అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర వైద్య సేవలకు ఇకమీద ట 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేటకు గాని వంద కిలోమీ టర్ల దూరంలో ఉన్న ఖమ్మం వరకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి నుం డి విముక్తి లభించనుంది.
అంతేకాక వైద్య సిబ్బంది సంఖ్య సుమారు మూడు రెట్లు పెరగనుం ది. పెద్ద ఆపరేషన్ థియేటర్లో, అధు నాతన వైద్య పరికరాలు, ఇన్టెన్సీవ్ కేర్, ఆక్సిజన్ పరికరాలు, రక్త పరీక్ష ల ల్యాబ్, సిటీ స్కానింగ్, బ్లడ్ బ్యాంక్, లాంటి అనేక వసతులతో అందుబాటులోకి వస్తాయి. అంతే కాక సివిల్ సర్జన్లు, వివిధ రోగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, రే డియాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ లాంటిది 150 మంది పైగా వైద్య సి బ్బంది ప్రజలకు సేవలు అందించ నున్నారు. వంద పడక ఆసుపత్రి ఏర్పాటు పట్ల తుంగతుర్తి నియోజ కవర్గంలోని ఆరు మండలాలతో పా టు తొర్రూరు దంతాలపల్లి తదితర మండలాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రానుంది.
ఇప్పటి కైనా అధికారులు స్పందించి ఆసుప త్రి నిర్మాణ పనులు వేగవం తం చేసి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ఉన్న వసతులతో ఆసుపత్రిని ప్ర జలకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా సిబ్బంది కృషి చేస్తున్నారు. బాగా ఆసుపత్రిలో జనరేటర్ సౌ క ర్యం లేనట్లు సమాచారం అంతేకాక దశాబ్దాల కాలం క్రితం ఏర్పాటు చే సిన ఎక్స్రే మిషన్ కేవలం ఆసుపత్రి లో ఆత్యాదనగానే మిగిలింది.
ఎ క్స్రే మిషన్ పనిచేయకపోవడం తో ఆసుపత్రికి దెబ్బలు తగిలి వచ్చే పే షెంట్ ఎక్సరే తీసిన ఒక్కోసారి విరి గిన భాగం కనబడడం లేదని మళ్లీ డిజిటల్ ఎక్స్రే కోసం వెళ్లాల్సి వ స్తుందని విషయం తెలుస్తోంది. ఆ స్పత్రిలో ఉన్న అరకొర వసతు లను పరిశీ లించి తక్షణమే అన్ని వ సతులు ఉండే విధంగా ఏర్పాటు చే యాలని అలాగే ఆసుపత్రి నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని పరిశీలించి నిర్మాణ పనులు వేగవంతం అయ్యే లా చర్యలు తీసుకోవాలని యావత్ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజానీకం ముక్తకంఠంతో కోరుతుంది.