BigBreking kurnoolbusfire : బిగ్ బ్రేకింగ్, కర్నూల్ లో ప్రైవేట్ బస్సుదగ్ధం, పలువురు ప్రయాణికులు సజీవదహనం
BigBreking kurnoolbusfire: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున హృద య విదారక ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మే ర కు…కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదా నికి గురై బస్సు కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవ దహనానికి గురైనట్లు సమాచారం అందు తోంది.
దాదాపు 30మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగు ళూ రు వెళ్తున్న క్రమంలో కావేరీ ట్రావెల్స్ బ స్సు మంటల్లో చిక్కుకొని కా లి బూడిదైంది. బస్సును బైక్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ప లు వురు ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారని తెలుస్తోంది. బ స్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కర్నూల్ జిల్లా కల్లూరు మండ లం చిన్నటేకూరు సమీపంలో దుర్ఘటన చోటు చేసు కుంది.
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. క ర్నూల్ జిల్లా కల్లూరు మండలం చి న్నటేకూరు దగ్గర కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిబూడిదైంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గం టల ప్రాంతంలో బస్సులో ఈ అ గ్ని ప్రమాదంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో ఓ బైక్‌ను బస్సు ఢీ కొట్టి ఆ తర్వాత బైకు బస్సుకిందకు వెళ్లి పేలిపోవడంతో మంట లు చెలరేగినట్లు తదననంతరం వెంటవెంటనే బస్సు మొత్తం మం టలు వ్యాపించడo, మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణి కులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడడం పదు ల సంఖ్యలో ప లువురు ప్రయాణీకు లు సజీవదహనం కావడం చకచక జరిగి పో యాయని ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు బిక్కు బిక్కుమం టూ చెబుతున్నారు.
బస్సు దగ్దం ప్రమాదoలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం క ర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. బస్సు బెంగళూరు నుం చి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘ టన చోటుచేసుకుంది. ప్ర మాద సమయంలో బస్సులో 40 మంది ప్ర యాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీవర్షం కురివడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని తెలిసింది.
కర్నూలు బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
బస్సు దగ్ధమైన ఘటనలో పలువు రు చనిపోవడంపై ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి నారా చంద్రబాబు నా యుడు తీవ్ర విచారం వ్యక్తం . ప్ర మాద ఘటనను దుబాయ్ పర్యట నలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు. సీఎస్ తో పాటు ఇతర అధికా రులతో మా ట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకు న్నారు. ఉన్నత స్థాయి యంత్రాం గం అంతా ఘటనా స్థలానికి వెళ్లి స హాయక చర్యల్లో పాల్గొనాలని ఆదే శించారు. క్షతగాత్రులకు, బాధితు లకు అవసరమైన సహకారం అం దించాలని, మృతుల సంఖ్య పెర గకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.