Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgondaCollector AntiRagging: నల్లగొండ జిల్లా కలెక్టర్ సీరియస్, ర్యాగింగ్ వల్ల కళాశాల నుండి బహిష్కరణ, క్రిమినల్...

    NalgondaCollector AntiRagging: నల్లగొండ జిల్లా కలెక్టర్ సీరియస్, ర్యాగింగ్ వల్ల కళాశాల నుండి బహిష్కరణ, క్రిమినల్ కేసుల నమోదు

    📰 Generate e-Paper Clip

     

    NalgondaCollector AntiRagging: ప్రజా దీవెన నల్లగొం డ: నల్లగొండ ప్ర భుత్వ వైద కళాశాలలో ర్యాగింగ్ జ రిగినట్టు వి ద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలే దని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి తెలిపారు. అయినప్పటికీ ఈ విష యంపై జిల్లా యంత్రాంగం వి ద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించిన ట్లు వెల్లడించారు. తమ చర్చల్లో సీ నియర్ విద్యార్థులు జూనియర్ వి ద్యార్థులతో స్నేహ పూర్వకమైన వా తావరణంలోనే మెలిగినట్లు త మ దృష్టికి వచ్చిందని తెలిపారు. నల్ల గొండ ప్రభుత్వ వైద్య కళాశా లలో ర్యాగింగ్ జరిగినట్లు మీడియాలో వ చ్చిన వార్తలపై జిల్లా కలె క్టర్ శుక్ర వారం స్థానిక సంస్థల ఇంచార్జ్ అద నపు కలెక్టర్ నారా య ణ్ అమిత్ , నల్లగొండ ఆర్డీవో అశోక్ రెడ్డిలతో కలిసి ప్రభుత్వ వైద్య క ళాశాలను సందర్శించారు.

    వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనా రాయణ , హెచ్ ఓడిలు ,అధ్యా పక బృందం, విద్యార్థిసంఘాల నాయ కులు, మెంటర్లు, విద్యార్థు లతో ఆ మె విడివిడిగా చర్చించారు. మీడి యాలో వచ్చిన వార్తల దృష్ట్యాని జంగా వైద్య కళాశాలలో జరిగిన సంఘటనలను వివరిం చాలని ఆ మె విద్యార్థులను అడిగారు. తమ ను ఎవరు ర్యాగింగ్ చే యలేదని, స్నేహపూర్వక వాతావరణంలోనే తాము ఉన్నామని విద్యార్థులు జి ల్లా కలెక్టర్ కు వివరించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి ద్యార్థులతో మాట్లాడుతూ ర్యాగింగ్ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియ స్ గా తీసుకుంటున్నదని, ఎవరై తే ర్యాగింగ్ కు పాల్పడతారో వారు చ ట్టరీత్యా తప్పు చేసిన వార వుతార ని, అలాంటి వారిపై క్రమశిక్షణ చ ర్యలు ఉంటాయని తెలి పారు.కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా ప్రతి వైద్య కళాశాలకు మెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, ర్యా గింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడైనా ర్యాగింగ్ కు పాల్పడినా, ర్యాగింగ్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎలాంటి రికమండేషన్లు పనిచేయ వని, విలువైన జీవితాన్ని విద్యా ర్థు లు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చ రించారు.

    ఏవైనా సమస్య ఉంటే విద్యార్థులు తమ దృష్టికి తీసుకు రావాలని, ర్యాగింగ్ వంటి వాటికి పా ల్పడవ ద్దని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను చది విస్తారని, ఒక డాక్టర్ గా రాణిం చేం దుకు ఎంతో కష్టపడి నీట్ రాయ డంతో పాటు, 5 సంవత్సరా లు ఎం బిబిఎస్ విద్యను అభ్యసించాల్సి ఉంటుందని, సమాజంలో ఒక మం చి డాక్టర్ గా సేవలందించే విషయం పై వైద్య విద్యార్థులు దృష్టి సారించా లని, ముఖ్యంగా తల్లిదండ్రులను బాధపెట్టకుండా వారి గురించి ఆలో చించాలని ఆమె వారికి హితబోధ చేశారు. ర్యాగింగ్ వల్ల అందరికీ చె డ్డ పేరు వస్తుందన్నారు. ర్యాగింగ్ చేస్తే కళాశాల నుండి బహిష్కరణ కు గురి కావడమే కాకుండా, క్రిమి నల్ కేసులు నమోదవుతాయని, దీనివల్ల జీవితమే నాశనం అయిపో తుందని తెలిపారు.

    నల్గొండ వైద్య కళాశాలపై వచ్చిన ర్యాగింగ్ అంశం తీవ్రంగా పరిగ ణించి సీసీటీవీ ఫుటే జీలను సైతం పరిశీలించడం జరు గుతున్న దని ఆమె స్పష్టం చేశారు. ఇకపై వైద్య కళాశాలలో ఆకస్మికం గా విద్యార్థుల గదులను తనిఖీ చే యడం జరుగుతుందని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ఆమె హెచ్చరించారు. అదే సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థులు జిల్లా యం త్రాం గం దృష్టికి తీసుకు రావాలని, స్థా నిక సంస్థల ఇన్చార్జ్ అదన పు కలె క్టర్ లేదా నల్గొండ ఆర్డిఓ కు తెలియ జేయాలని సూచిస్తూ వారి ఫోన్ నెం బర్లను విద్యార్థులకు తెలియజే శా రు. స్థానిక సంస్థ ల ఇన్చార్జ్ అద నపు కలెక్టర్ నారాయణ అ మి త్ , స్థానిక ఆర్డిఓ అశోక్ రెడ్డి, కళా శాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, అధ్యాపక బృందం ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.