Sunday, September 27, 2026
More
    HomePoliticsMinister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి అప్పీల్, తేమ, తరుగు, తాలు విషయాలతో రైతు లను...

    Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి అప్పీల్, తేమ, తరుగు, తాలు విషయాలతో రైతు లను సతాయించొద్దు

    📰 Generate e-Paper Clip

    –రైతుఇబ్బందుల దృష్టితో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

    –కేంద్రాలు, మిల్లుల్లో నైట్ షిఫ్టులు పనిచేసే విధంగా చూడాలి

    — ధాన్యం,పత్తి సేకరణపై అధికారు లు, రైస్ మిల్లర్లతో సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి

    Minister Komatireddy : ప్రజా దీవెన నల్లగొండ:అధికారులు, రైస్ మిల్లర్లు రాత్రి , పగలు పనిచేసి ధాన్యం కొనుగోలును సవ్యంగా పూ ర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవ నా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బు ధవారం అయన జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలోని సమావేశ మంది రంలో ధాన్యం, పత్తి సేకరణ, అభి వృద్ధి కార్యక్రమాలపై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వ హిం చారు. అకాల వర్షాలు ,తుఫాన్ వల్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఏ ర్పడ్డాయని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు వేగ వంతం చేయాలన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నం దున ,అవసరమైతే లైట్లు ఏర్పాటు చేసి రాత్రి, పగలు ధాన్యం కొనుగో లు చేయాలని కోరారు. వ చ్చే నెల రోజులపాటు కొనుగోలు కేంద్రాలకు దాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం సేకరణపై ప్ర త్యేక దృష్టి కేంద్రీకరించి ధాన్యం సేక రణను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

    కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చే సి న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని, మిల్లర్లు రైతులను ఏలాంటి ఇబ్బందులకు గురి చేయ కుండా ధాన్యం దిగుమతి చేసుకో వాలని, ఈ విషయంలో రైతులకు పూర్తి సహకారం అందించాలని ఆ యన విజ్ఞప్తి చేశారు. తేమ, తరు గు, తాలు వంటి విషయాలతో రైతు లను సతాయించవద్దని ఆయన కో రారు. ఎండలు బాగా వస్తున్నందు న రైతులు పగటిపూట ధాన్యాన్ని అరబెట్టుకోవాలని ,సరైన తేమ వ చ్చిన వెంటనే అమ్ముకునేలా చర్య లు తీసుకోవాలని కోరారు.

    కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లను,ప్యాడి క్లీనర్లు,తేమ యంత్రాలను ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు టపాలిన్లను తెప్పిం చాలని మార్కెటింగ్ శాఖ అ ధికారులను ఆదేశించారు. కొనుగో లు కేంద్రాలు,మిల్లులలో నైట్ షిఫ్ట్లు ఏర్పా టు చేసి హమాలీలు పనిచేసే విధంగా చూడాలని, రాష్ట్రంలోనే న ల్గొండ జిల్లా ధాన్యంసేకరణలో రెం డవ స్థానం పొందినని, దీన్ని దృష్టి లో ఉంచుకొని కొనుగోలును సవ్యం గా చేయాల్సిందిగా కోరారు.

    పత్తి కొనుగోలపై మంత్రి సమీక్షిస్తూ సీసీఐ నిబంధనల సడలింపుకు సం బంధించి ఇదివరకే కేంద్ర ప్రభుత్వా నికి నివేదించడం జరిగిందని,రా ష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవా ల్సి న అంశాలు ఉన్నామని, పత్తి కొ ను గోలు విషయంలో ఇదివరకే మిల్ల ర్ల తో మాట్లాడటం జరిగిందని తెలి పా రు.

    జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడు తూ ఈ వానాకాలం లో జిల్లాలో 6, 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నదని, నల్గొండ నియోజకవ ర్గంలో ఎక్కువగా దొడ్డు ధాన్యం వ స్తున్నదని, ఇప్పటివరకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, నాగా ర్జునసాగర్ కమాండ్ ఏరియాలో ఇ ప్పుడిప్పుడే ధాన్యం కొనుగోలు ప్రా రంభమవుతున్నాయని, తుఫాను వల్ల ధాన్యం సేకరణకు ఇబ్బంది కలి గిందని ,అయినప్పటికీ 40 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేయడం జరిగిందని, ఈ సీజన్లో ఒక్కరోజు 3 6 కోట్లు చెల్లించిన దాఖలాలు ఉ న్నాయని తెలిపారు. జిల్లాలో తు ఫాను వల్ల తడిసిన 4600 మె. ట న్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరిగిందని, జిల్లాలో గో దాం సమస్యను దృష్టిలో ఉంచుకొ ని పెద్ద వేర్ హౌస్ గోదాం నిర్మాణం అవసరమని, సైలొసిస్టంలో గోదా ము ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

    రైస్ మిల్లర్లు నారాయణ, భద్రం, ఇం ద్రసేనారెడ్డిలు మాట్లాడుతూ బాయి ల్డ్ రైస్ కోట జిల్లాకు ఎక్కువగా ఇ ప్పించాలని, బకాయి ఉన్న మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్పోర్ట్ బకాయిలను వెంటనే ఇప్పించాలని విజ్ఞప్తి చేశా రు.ఈ విషయంపై మంత్రి స్పంది స్తూ జిల్లాకు బాయిల్డ్ రైస్ కోటా ఎ క్కువగా ఇచ్చే విషయం రాష్ట్ర ము ఖ్యమంత్రితో మాట్లాడుతామని, అదేవిధంగా పత్తి కొనుగోలు విష యమై ఢిల్లీలోని అధికారులతో ఇది వరకే మాట్లాడడం జరిగిందని, బ కాయిల విషయంలో ఎఫ్సీఐ అధి కారులతో మాట్లాడి ఇప్పించే ఏ ర్పా టు చేస్తామని తెలిపారు. రెవెన్యూ అ దనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, పౌర సరఫరాల జిల్లా అధికారి వెంకటేష్, జిల్లా మేనేజర్ గోపికృష్ణ, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిసీఓ పత్యా నాయక్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.