Sunday, September 27, 2026
More
    HomePoliticsManda Krishna Madiga : చీఫ్ జస్టిస్ పైదాడి 30 కోట్ల దళితు ల మీద...

    Manda Krishna Madiga : చీఫ్ జస్టిస్ పైదాడి 30 కోట్ల దళితు ల మీద జరిగిన దాడి

    📰 Generate e-Paper Clip

    –ధర్మం, విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి గుణపా ఠం నేర్పుతాం

    –న్యాయ, పోలీసు వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్ వివక్షత పాటిం చాయి

    –మను ధర్మాన్ని రుద్దాలని చూసే వారెవరై నా మాకు శత్రువులే

    –దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీ యాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం

    –ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

    Manda Krishna Madiga : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: సుప్రీం కో ర్టు చీఫ్ జస్టీస్ BR గవాయి మీద జ రిగిన దాడి దేశంలోని ముప్ఫై కోట్ల మంది దళిత ప్రజల మీద జరిగిన దాడే అని, దళితుల మీద దాడుల కు పాల్పడే వారికి చట్టాలు వర్తిం చకపోవడం అత్యంత దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు లు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ద్వ జమెత్తారు.చీఫ్ జస్టిస్ గవాయి మీ ద జరిగిన పాశవిక దాడిని నిరసి స్తూ ఎమ్మార్పీ ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దళితుల ఆ త్మగౌరవ సభలో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డారు.

    చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెప్తుంటే అందుకు విరుద్ధంగా చట్టపరమైన వ్యవస్థలు దళితుల మీద దాడులకు పాల్పడు తున్న వారి మీద చర్యలు తీసుకోవ డం లేదని అన్నారు. ధర్మం ముసు గులో విశ్వాసాల ముసుగులో దా డులకు పాల్పడే వారికి చట్టాలు వ ర్తించవా వారి మీద చర్యలు తీసు కోరా అని ప్రశ్నించారు.దళితుల మీద దాడులకు పాల్పడితే చట్టాలు వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

    న్యాయ వ్యవస్థ, డిల్లి పోలీసు వ్యవ స్థ, జాతీయ మానవ హక్కుల కమి షన్ తమ కర్తవ్యాలను అమలు చే యడంలో పూర్తి వివక్షతను చూపె ట్టయని అన్నారు. ఎన్నో సంఘట నల మీద పత్రికల్లో వచ్చిన వార్తల ను ఆధారంగా చేసుకొని సుమోటో గా కేసులు తీసుకున్న వ్యవస్థలు దేశంలోనే అత్యున్నతమైన సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టీస్ గా ఉన్న గవా యి మీద జరిగితే ఎందుకు మౌనం వహించాయని ప్రశ్నించారు.

    ఘటన జరిగి నెల రోజులు గడిచినా కనీసం చట్టపరంగా ఒక చర్య కూ డా ఎందుకు తీసుకోలేదు అని ప్ర శ్నించారు. ఇది వివక్షతను చూపు తున్న చర్య, ఇది రాజ్యాంగ స్ఫూర్తి కి పూర్తి విరుద్ధమైన చర్య అని అ న్నారు. దళితుల మీద దాడులకు పాల్పడితే సహించే రోజులు పో యాయని అన్నారు. ధర్మం ముసు గులో విశ్వాసాల ముసుగులో దా డులు పాల్పడే వారికి తగిన గుణ పాఠం నేర్పుతామని అన్నారు.

    మా పోరాటం దళితుల ఆత్మగౌర వాన్ని నిలబెట్టుకోవడానికి, న్యా యవ్యవస్థ స్వతంత్రను కాపాడు కోవడానికి, రాజ్యాంగాన్ని పరిర క్షిం చుకోవడానికే జరుగుతుందని అ న్నారు. రాజ్యాంగం ద్వారానే దళి తులకు మానవ హక్కులు లభించి మనుష్యులుగా గుర్తించబడ్డారని అన్నారు.

    దళితులు ఉన్నత స్థాయికి ఎదగ డానికి రాజ్యాంగమే కారణం.ఇలా ఉన్నత స్థాయిలోకి ఎదగడకపోవ డం కొంత మంది జీర్ణించుకోలేకపో తున్నారని అన్నారు. అందుకే రా జ్యాంగాన్ని ధ్వంసం చేయాలని కు ట్రలు చేస్తున్నారని అన్నారు. ఇలాం టి గొప్ప రాజ్యాంగాన్ని తొలగించి మను ధర్మాన్ని ప్రజల మీద రుద్దాల ని చేసే వారెవరైనా మాకు బద్ద శ త్రువులే అని ప్రకటించారు. ప్రజాస్వామ్య స్థానంలో రాచరిక వ్యవస్థ తీసుకొచ్చే మను ధర్మాన్ని సహించేది లేదని అన్నారు. ప్రజా స్వామ్యం, సామాజిక న్యాయం సమానత్వం కోసం రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు

    ఈ సభకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డా. మున్నంగి నాగరా జు మాదిగ అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.గో విందు నరేష్ మాదిగసొట్ట నరేంద్ర బాబు మాదిగ, కడార్ల నవీన్ చారి నార్త్ ఇండియా ఇంచార్జీ, రుద్రపో గు సురేష్ ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు, కర్ణాటక నుండి నర్సాప్ప మాదిగ, మహారాష్ట్ర నుండి అజిత్ , ఉత్త రా ఖండ్ నుండి ఆశిష్ కుమార్, తమి ళనాడు నుండి లోకేష్, హర్యాన నుండి సత్యపాల్, ఉత్తర,దక్షిణ రా ష్ట్రంల నుంచి నాయకులు కార్య క ర్తలు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.