కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభ వియవంతం చేయండి
నాయకులు కామా అశోక్ పిలుపు
ప్రజా దీవెన/ఖమ్మం: ఖమ్మంలో ఆదివారం తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు నాయకులు కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ ప్రజలకు కామా అశోక్ విజ్జప్తి చేశారు.
ఏఐసిసి నేత రాహుల్ గాంధీ వస్తున్నసభను అడ్డుకునేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని, కార్యకర్తలు, నాయకులు ఎటువంటి అపోహలను, వదంతులను నమ్మకుండా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడం అధికారపార్టీకి మింగుడుపడడం లేదని, దాంతో సభను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ హాజరవనున్న సభను ఆపడం ఎవరితరం కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని అది తెలిసి జీర్ణించుకోలేకే బిఆర్ఎస్ నాయకులు అడుకుంటునరు వారికి రానున్న రోజుల్లో ప్రజలు ఓట్లతో బుద్ది చెప్తారు.