Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IPL- 2024 UPPAL, HYDERABAD : ఐపిఎల్-2024 క్రికెట్ ఎప్పుడో తెలుసా

-- నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు శ్రీకారం  --క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు -- రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్ --మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్

ఐపిఎల్-2024 క్రికెట్ ఎప్పుడో తెలుసా

— నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు శ్రీకారం 
–క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
— రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్
–మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్

ప్రజా దీవెన/ హైదరాబాద్: క్రికెట్ వీరాభిమానులు ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందింది. రాబోయే వారం రోజుల్లోనే హైదరాబా ద్ కేంద్రంగా ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నట్లు నిర్వాహ కులు వెల్లడించారు.  అయితే మ్యాచ్లు నిర్వహణ సందర్భంగా భద్ర తా ఏర్పాట్లు అభిమానులకు ఎలాంటి అసౌకర్యమైన పరిస్థితి ఎదు రుకాకుండా పోలీస్ యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీ య స్టేడియంలో త్వరలో జరగనున్న 202 4 IPL క్రికెట్ పోటీల నిర్వ హణకు సంబంధించిన భద్రతా ఏ ర్పాట్ల గురించి రాచకొండ కమిష నర్ తరుణ్ జోషి ఐపిఎస్ నేరేడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయం లో డీసీపీలు, ఏసిపిల తో పాటు సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి ఐపీఎస్ మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగనున్న మ్యాచ్ ల నిర్వహణకు అవసర మై న అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అ ధికారులను ఆదేశించారు. రాచకొండ కమి షనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడంలో తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పా ట్లు చేయా లని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బం దోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని ఐపీఎల్ నిర్వహణ బృందానికి సూచించారు.ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పా ట్లు చేయాలని సూచించారు. సాధారణ వాహనదారు ల రాకపోక లకు ఎటువంటి ఇబ్బందులూ లే కుండా, ఉప్పల్ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

స్టేడియం పరి సరాల్లో సీసీటీ వీలను ఏర్పాటు చేయాలని సూచించా రు. ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమె రాల్లో నిక్షిప్తం అవుతాయ ని పేర్కొ న్నారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసు కుంటామని, టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి పుకా ర్లనూ నమ్మవద్దని తెలిపారు. ఈ సమావేశంలో డిసిపి మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, ఎస్బి డీసీపీ కరుణాకర్, డీసీపీ ట్రాఫిక్ మనో హర్, అడిషనల్ డీసీపీ నరసింహ రెడ్డి, ఏసిపి శ్రీధర్ రెడ్డి, ఏసిపి నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.