Dhoni, rohith Sharma, fans fight ధోనీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య గొడవ
ధోని, రోహిత్ శర్మ అభిమానుల మధ్య గొడ
ధోని, రోహిత్ శర్మ అభిమానుల మధ్య గొడ
-వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
ధోని, రోహిత్ శర్మ అభిమానుల మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే ఈ నెల 27న ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ టీములకు మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో కొల్లాపూర్ లోని కొంతమంది యువకులు ధోని ఫ్యాన్స్ మరికొంతమంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ మ్యాచ్ వీక్షిస్తుండగా రోహిత్ శర్మ వికెట్ పడిపోవడంతో ఒక్కసారిగా ధోని ఫ్యాన్స్ హేలనగా మాట్లాడడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.