Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Technical education feeses : వృత్తివిద్యా కళాశాలలు దుర్భరం

--ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, కాలేజీలను కాటికి పంపిస్తారా --మూడేళ్లుగా బకాయిపడ్డ రూ.7 వేల కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ --రేపటితో టోకెన్ల చివరి గడువుతో కాలేజీల పరిస్థితేమిటి --ఈలోగా టోకెన్లకు డబ్బులు మంజూరుకై సీఎం స్పందించాలి --బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

వృత్తివిద్యా కళాశాలలు దుర్భరం

–ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, కాలేజీలను కాటికి పంపిస్తారా
–మూడేళ్లుగా బకాయిపడ్డ రూ.7 వేల కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్
–రేపటితో టోకెన్ల చివరి గడువుతో కాలేజీల పరిస్థితేమిటి
–ఈలోగా టోకెన్లకు డబ్బులు మంజూరుకై సీఎం స్పందించాలి
–బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

ప్రజా దీవెన/హైదరాబాద్: రాష్ట్రం లోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వ్రు త్తి విద్యా కళాశాలల పరిస్థితి దుర్భరంగా మారిందని, దీనికి ప్రధాన కారణం ఫీజు రీయంబర్స్ మెంట్ట్ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అను సరిస్తున్న విధానాలే కారణమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఫీజురీయంబ ర్స్ మెంట్ నిధులను సక్రమంగా కాలేజీలకు చెల్లించలేదని, నాటి ప్రభుత్వ నిర్వాకంవల్ల అటు కాలేజీ యాజ మాన్యాలు, ఇటు విద్యార్థు లు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.

గత మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు చెల్లించకపోవడం తో దాదాపు రూ.7,800 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వివ రించారు. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలు, కళాశా ల భవన అ ద్దె, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లిం చలేక గత మూడేళ్ల లో వందలాది కాలేజీలు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల్లో దాదాపు రూ. 7 50 కోట్లు డిగ్రీ, పీజీ కళాశాలలకు మార్చి నెలాఖరు నాటికి చెల్లిస్తామ ని పేర్కొంటూ టోకెన్లు జారీ చేసిందని గుర్తు చేశారు.

కానీ నేటి వరకు నయా పైసా చెల్లించలేదని, రేపటి తో(ఈనెల 31నా టికి) టోకెన్ల గ డువు ముగుస్తోంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభు త్వం ద్రుష్టికి ఈ అంశా న్ని తీసుకెళ్లినా ఇప్పటి వరకు స్పందన లేకపో వడం బాధాకర మని వ్యాఖ్యానించారు.విద్యారంగంలో అనేక మా ర్పులు తీసుకొస్తా మని, ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను సక్రమం గా చెల్లించడంతో పాటు మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నిక ల మేనిఫెస్టోలో పొందుపర్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వం దరోజులైనా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులకు సంబంధించి నయా పైసా చెల్లించలే దని విమర్శించారు.

సర్కార్ నిర్వా కంవల్ల ముఖ్యం గా సిబ్బంది జీతభ త్యాలు, కళాశాల ల అద్దెలు, మెయింటెనెన్స్ ఛార్జీ ల కోసం ఆయా కళాశాలల యాజ మాన్యాలు తెచ్చిన అప్పులకు వ డ్డీలు కట్టేలేక ఇబ్బంది పడుతున్నా రు. కొన్ని కళాశాలల యాజ మా న్యాలు ఫీజులు చెల్లించాలంటూ వి ద్యార్థుల పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయని, ఆ యా కాలేజీల్లో చది వే విద్యార్థు లంతా నిరుపేదలే కావడంతో ఫీజు లు చెల్లించలేక మ ధ్యలోనే చదువు మానేస్తున్నారని తెలిపారు.

ఆయినా కాంగ్రెస్ ప్రభు త్వం పట్టించుకోక పోవడం దారుణమని, గ త బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల ను పరిశీలిస్తే ప్రైవే టు కాలేజీలను చంపేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్పిస్తోం దని ధ్వజమెత్తారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసి రోడ్డున పడేసే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆందోళ న వ్యక్తం చేశారు. ఇప్పప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని, గత ప్రభు త్వం జారీ చేసిన టోకెన్లకు సంబం ధించి నిధులను రేపటిలోగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

దీంతోపాటు నిర్దిష్ట గడువు లోగా ఫీజు రీయంబ ర్స్ మెంట్ బకాయి లన్నీ చెల్లించడంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపుల విషయంలో మరింత మెరుగైన విధానాన్ని అమలు చేయాలని బీజేపీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డి


మాండ్ చేస్తున్నామని చెప్పారు.