న్యాయవాది రాపోలు భాస్కర్ కు ఆహ్వానం
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యా జ్యాలు వేస్తూ వివిధ రకాలుగా సమాజానికి సేవలు అందిస్తున్న తెలంగాణ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కు ఆ
జూన్ లో మూడు రోజుల 18వ వార్షిక ఆటా సదస్సు కు
ప్రజా దీవెన, హైదరాబాద్: హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యా జ్యాలు వేస్తూ వివిధ రకాలుగా సమాజానికి సేవలు అందిస్తున్న తెలంగాణ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కు ఆటా అహ్వా నం పంపింది. అమెరికా దేశంలోని అట్లాంటాలో జూన్ 7,8,9 మూడు రోజుల పాటు జరిగే 18వ వార్షిక ఆటా (అమెరికన్ తెలుగు అసో సియేషన్) సదస్సులో పాల్గొనాల్సిం దిగా అమెరికన్ తెలుగు అసోసి యే షన్ అధ్యక్షులు మధు బొమ్మినేని, అసోసియేషన్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, అసో సియేషన్ కమిటీ సగౌ రవంగా ఆహ్వానించింది.
న్యాయ వాద వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి తన నైపుణ్యంతో ఎన్నో అసాధా రణ కేసులను కూడా సునాయాసం గా పరిష్కరిస్తూ సమాజసేవలో ముందుంటున్న భాస్కర్ కు ఆటా అహ్వానం అందించింది. ఇంతటి ఉన్నతమైన స్థాయికి చేరి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చు కున్న రాపోలు భాస్కర్ కి అద్భుత మైన ఆహ్వానం రావడం హర్షణీ యం అని తోటి హైకోర్టు న్యాయ వాదులు తెలంగా ణ రాష్ట్రం లోని పలు జిల్లాల కోర్టు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు.