Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagadeesh reddy: కాంగ్రెసోళ్ళు కళ్ళున్న కబోధులు

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు కళ్ళున్న కబోదులని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు

కళ్ళ ముందే నీళ్లుపోతున్నా నిలువరించలేక పోయారు
చంద్రబాబు, వైస్సార్ హయాంలో నూ నోరెత్తనిది మీరు కాదా
ఆరోగ్యం సహకరించకున్నా రైతుల కోసం తిరుగుతున్న పోరాటయోధుడు కెసిఆర్

ప్రజా దీవెన, కోదాడ: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు కళ్ళున్న కబోదులని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. కళ్ళ ముందే నీళ్లుపోతున్నా నిలువరించలేక పోయారని, నాడు చంద్ర బాబు, వైస్సార్ హయాంలో నూ నోరెత్తనిది మీరు కాదా అని ప్రశ్నించారు. జేబులో కతెర పెట్టు కునేవాడు జేబుదొంగనే అని, మంది లాగులు ఊడగొట్టి ఏమి చూస్తావు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం అయింది అందు కోసమేనా అని చురక అంటిం చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రండల ప్రభు త్వమని, చేసేది ఏదీ చేతకాక కేసులు పెడితే ఏమవుతుందన్న ఆలోచన కలిగిన మంత్రులు ఈ ప్రభుత్వంలో ఉన్నారని అసహన వ్యక్తం చేశారు. పార్టీ లేకుండా చేస్తారoటా నీవల్ల కాదుగదా మీ జేజమ్మ వల్ల కూడా కాదని హెచ్చ రించారు. ఇద్దర్ని మడత పెట్టి కొట్టిన ఘనత కెసిఆర్దని, కానీ ఇవ్వాళ జనరేటర్ కొనడానికి రైతులు బారులు తీరాల్సి వస్తుందని, మీరు చెప్పే మార్పు ఉన్నవి వుండబీకడమా అని ప్రశ్నించారు. నువ్వు జేబు దొంగ కావొచ్చు మొదలు ఇపుడు సీఎం అని గుర్తు పెట్టుకో అని గుర్తు చేశారు. గత పదేళ్లలో మా ప్రభు త్వం ఏనాడైనా కేసులు పెట్టమని చెప్పిందా అన్నారు.

ఎవరి కోసం ఏ పథకం పెడదాం అని ఆలోచించాము తప్ప మీ లాగా కానీ వీళ్ళు పొద్దున్న లేస్తే దొంగ మాటలు మాట్లాడే వారం కాదని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాదిరి ఉత్తర కుమార ప్రగల్బాలు పలికే వాళ్ళం కాదని స్పష్టం చేశారు. 60 ఎండ్ల దుర్మార్గం పాలన చేస్తే ఫ్లోరోసిస్ అవతరించిందని, కేసీఆర్ ఫ్లోరైడ్ ను పారదోలాడని, ఆనాడు నల్లగొండ లో 3 నుంచి 4 లక్షల ధాన్యమే పండగా నేడు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశానికి నల్లగొండ ధాన్యగారం అయిందని వివరించారు. ఓటు వేయించుకుని అబద్దపు పాలన చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను దుయ్యబట్టారు. 420 హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని, డిసెంబర్ 9 నుంచి ఇస్తానన్న ఆరు గ్యారంటీ లు ఎటూ పోయాయని ప్రశ్నించారు.

రైతుబంధు రూ. 15 వేలు ఎటూ పోయే, అన్ని పంటల కు ఇస్తాన్నన రూ.500/- బోనస్ ఎటూ పోయే అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ హామీలు అడిగితే కెసిఆర్ నూ బొంద పెట్టాలి అంటున్నారు, రుణమాఫీ అడిగితే బెదిరిస్తున్నారని, మాట ఇచ్చి మో సం చేసిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని, కెసిఆర్ ఎప్పుడైనా చేయ గలిగిందే చెప్పాడు, చేపిందే అమలు చేసి చూపించాడని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకునే పాలన చేసే మీరూ రండలు, అక్రమ కేసులు పెట్టే మీరు రండలంటూ తీవ్ర స్ధాయిలో వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ హయాంలో ఇవి లేవని, ప్రజలకు అవసరం అయినా పథకాలు ఇచ్చే ప్రయత్నం జరిగిందని చెప్పారు.

బిఆరెస్ కార్యకర్తలనూ వేదిస్తే ఊరుకోమని, కాంగ్రెస్ పార్టీ మోసపు మాటలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ల ముచ్చట అడిగితె, అర్థం కావట్లేదు అంటున్నాడని, అంతటి పెద్ద అసమర్థుడు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హయాంలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయని, వీటినే ప్రజల్లోకి విసతృతంగా తీసుకెళ్లాల ని కోరారు. ఈ సన్నాహక సమావేశంలో బి ఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి కృష్ణా రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, బిక్ష్మయ్య గౌడ్, విద్యావేత్త నరసింహరెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.