Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AP Assembly Elections: చంద్రబాబు నివాసంలో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ లోని ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిసవాంలో కూట‌మి నేతల కీలక భేటీ ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థ నాథ్ సింగ్, పార్టీకి చెందిన ఇతర నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ భేటీలో పాల్గొన్నారు.

హాజరైన పవన్ కళ్యాణ్ బిజెపి నేతలు

ప్రజా దీవెన, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిసవాంలో కూట‌మి నేతల కీలక భేటీ ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థ నాథ్ సింగ్, పార్టీకి చెందిన ఇతర నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపి స్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చించే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది.

ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేసే అంశంపై చర్చించనున్నారు. దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని యోచి స్తున్నారు. మరికొన్ని నియోజక వర్గాలపై కూడా చర్చలు జరప నున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీల మధ్య సమన్వయం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమలాపు రంలో ఉన్న చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకు న్నారు. మరోవైపు జనసేన అధినేతన పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థ సింగ్, అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.